సినిమా ఇండస్ట్రీలో ఓ మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న వాళ్లలో వేణు మాధవ్ కూడా ఒకరు.  వేణు మాధవ్ తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసి మెప్పించాడు.  స్టార్ హీరోలతో వరసగా సినిమాలు చేసిన కమెడియన్ వేణు మాధవ్.  ఒకానొక సమయంలో వేణు మాధవ్ లేకుండా సినిమాలు రాలేదని చెప్పాలి.  వేణు చేసిన సినిమాలు వరసగా హిట్ అయ్యేవి.  అలానే వేణు మాధవ్ కామెడీ కూడా ఆకట్టుకునేది. 


ఇక సినిమా ఇండస్ట్రీలో వేణు మాధవ్ తనకోసం ప్రత్యేకంగా పాత్రలను సృష్టించుకోవడం.. ప్రత్యేకంగా రైటర్స్ ను పెట్టుకొని సినిమాలు చేయడం చేసేవారు.  ఇలా చేయడం వలన ఆయనకు ఎంతో పేరు వచ్చింది.  కొంతమంది రైటర్స్ కు ఉపాధి కూడా లభించింది.  తాను నటించిన ప్రతి హీరోతోనూ ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉండేవాడు వేణు మాధవ్.  ముఖ్యంగా మెగాస్టార్ తో అన్నయ్య ఉన్న అనుబంధం గురించి మర్చిపోలేదని.  శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో వేణు పాత్ర ఎంతబాగా వచ్చిందో చెప్పక్కర్లేదు.  


ఇక ఇదిలా ఉంటె, వేణు మాధవ్ ప్రభాస్ తో కలిసి చాలా సినిమాల్లో నటించారు.  మెప్పించారు. వర్షం, అడవి రాముడు, ఛత్రపతి, చక్రం, యోగి, మున్నా, ఏక్ నిరంజన్ సినిమాల్లో నటించారు.  ఈ సినిమాల్లో తనదైన కామెడీతో మెప్పించాడు. ఒక విధంగా చెప్పాలి అంటే డార్లింగ్ ప్రభాస్ తోనే ఎక్కువ సినిమాలు చేశాడు ఈ కమెడియన్.  ఛత్రపతి సినిమాలో వేణు మాధవ్ పాత్ర చిన్నదే అయినప్పటికీ.. దాన్ని డిజైన్ చేసిన తీరు అద్భుతం అని చెప్పాలి.  


శ్రీయను ప్రేమించే వ్యక్తిగా రకరకాల గెటప్స్ లో కనిపిస్తాడు.  ప్రభాస్ ఛత్రపతిగా మారిన తరువాత వేణు మాధవ్ కు పెళ్లి చేసే సీన్, వేణు మాధవ్ చండ్రకోలు తో కొట్టుకునే సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది.  వేణుమాధవ్ టైమింగ్ కామెడీతో ఆకట్టుకుంటుంది.  ఇక ఈ సినిమా ప్రమోషన్ కోసం ఛత్రపతి టీ షర్ట్స్ ధరించి సరదగా క్రికెట్ ఆడుతూ అందరిని ఆకట్టుకున్నారు డార్లింగ్ ప్రభాస్, వేణు మాధవ్ లు.  ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: