మెగాస్టార్ చిరంజీవి నటించిన పీరియాడికల్ మూవీ సైరా మరో 6రోజుల్లో ప్రేక్షకులముందుకు రానుంది.   ఇప్పటికే విడుదలైన ఈచిత్రం యొక్క టీజర్ , ట్రైలర్  సినిమా ఫై విపరితమైన  హైప్ ను తీసుకొచ్చాయి.  దాంతో ఈసినిమా  టికెట్స్  కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.  బెంగుళూరు లోని అతి పెద్ద సింగిల్ స్క్రీన్ థియేటర్  ఊర్వశి లో  మొదటి రోజు ఉదయం  3.05 గంటల షో కు  ఈసినిమాకు  బుకింగ్స్ ఓపెన్ చేయగా  పెట్టిన 90 నిమిషాల్లోనే  టికెట్స్ అన్ని అమ్ముడుపోయాయి. ఈథియేటర్  సీటింగ్ కెపాసిటీ  1100.  దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు  అక్కడ ఈసినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందోనని. బెంగుళూరు లోనే కాదు యూఎస్ లోకూడా   ఈ సినిమా ప్రీ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయట. 



సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తొలి తరం  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా  తెరకెక్కిన ఈ చిత్రంలో  నయనతార కథానాయికగా నటించగా   అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , రవికిషన్ , జగపతి బాబు ,  సుధీప్ , తమన్నా  ముఖ్య పాత్రలు పోషించారు.   బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ చిత్రాన్ని  సుమారు 270 కోట్ల  భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై హీరో రామ్ చరణ్ ననిర్మించాడు.  ఈచిత్రం  అక్టోబర్ 2న గాంధీ జయంతి  సందర్భంగా తెలుగుతో పాటు కన్నడ, తమిళ , మలయాళ , హిందీ భాషల్లో భారీస్థాయిలో  విడుదలకానుంది. ఇక ఒక్క హిందీ లో తప్ప  దాదాపుగా అన్ని భాషల్లో సోలో గా నే విడుదలకానున్నడం సైరా కు కలిసిరానుంది. అయితే హిందీ లో  మాత్రం  సైరా కు పోటీగా  హృతిక్ రోషన్ , టైగర్ ష్రాఫ్  కలిసి నటించిన  వార్  విడుదలకానుంది.  మరి వార్ ను తట్టుకొని సైరా  ఎంత మేరకు కలెక్షన్స్ ను రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: