తెలుగు చిత్ర పరిశ్రమను కమెడియన్ వేణు మాధవ్ మరణం మరింత కలిచివేస్తుంది.వేణు తో తమకున్న అనుబంధం సినీ ప్రముఖులు ఒక్కొక్కరు వ్యక్తపరుస్తున్నారు. ఒక మిమిక్రి ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంబించిన వేణు అంచలంచలుగా ఎదుగుతూ మంచి కామెడీ యాక్టర్ గా పేరు సంపాదించాడు.ఇండస్ట్రీ లో డైరెక్టర్ల దగ్గరి నుండి బడా హీరోలతో పాటు ఈ తరం హీరోలందరితో వేణుకి మంచి సంబంధాలు ఉన్నాయి.

నటన పరంగానే కాకుండా ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు ప్రముఖులు.ఈ నేపథ్యంలో వేణు మాధవ్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ కొనియాడారు విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు.వేణు మాధవ్ ఇక లేరని తెలిసి అయన భావోద్వేగానికి లోనయ్యారు. వేణులో కేవలం మిమిక్రి ఆర్టిస్టు, నటుడు మాత్రమే కాదని ఆయనలో ఇంకా ఐదారు కళలు ఉన్నాయన్నారు.ఈ సందర్భంగా తెలుగు సినిమా 75 సంవత్సరాల వేడుకలను ఆయన గుర్తుచేసుకున్నారు.

ఆ వేడుకల్లో వేణు మాధవ్.. రామలింగయ్య గారి ముత్యాలు వస్తావా అనే పాటకు నటించారు. స్వయంగా రామలింగయ్యగారే వచ్చారా అనిపించేలా ఎమిటేట్ చేసేవారు వేణు.
కోట శ్రీనివాసరావు గారు ఒకానొక సందర్భంలో ఎయిర్ పోర్ట్‌లో ఏదో కొనుక్కోవల్సి వచ్చిందట.కానీ రూ. 2 వేలు తక్కువ అవడంతో తప్పని సరి పరిస్థితోలో వేణుని అడిగారట.
ఏ మాత్రం ఆలోచించకుండా తీసుకో బాబాయ్ అంటూ 2 వేల రూపాయలు కోట గారి చేతికి ఇచ్చారట.తరువాత ఆ డబ్బు గురించి ఎన్నడూ ప్రస్తావించలేదట వేణు. చివరికి కోట గారే తిరిగి ఇవ్వడానికి చాలా ట్రై చేశారు.


 కాని వేణు ఆ డబ్బు తీసుకోడానికి నిరాకరించాడు. ఎందుకు అని అడిగితే.. ఓ మహానటుడు నాకు అప్పు ఉన్నాడు అని చెప్పుకోవడానికి అన్నడట వేణు మాధవ్. 
ఆ రెండువేలు ఇప్పటికి వేణు మాధవ్ తీసుకోలేదు. అటువంటి వ్యక్తి ఇంత చిన్న వయసులో చనిపోవడం బాధాకరంగా ఉందన్నారు కోట శ్రీనివాస్.
వేణు ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కోటా శ్రీనివాసరావు.


    మరింత సమాచారం తెలుసుకోండి: