లౌక్యం’ తర్వాత సరైన హిట్టు లేని యాక్షన్ గోపీచంద్ "చాణక్య"మూవీ తో అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నాడు.పంతం మూవీ తరువాత గోపీచంద్, మెహ్రీన్ ఈ సినిమాలో జంటగా కనిపించబోతున్నారు.  అక్టోబర్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో చిత్ర యూనిట్ ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. 

 2 నిమిషాల నిమిది ఉన్న ట్రైలర్‌ని యాక్షన్ స్పై థ్రిల్లర్‌ మోడ్‌లో ఓపెన్ చేసారు. కానీ ఆ తరువాత మాత్రం గోపీచంద్ ఒక ఇన్నోసెంట్ బ్యాంకు ఎంప్లాయిగా కనిపించాడు.అక్కడే మెహ్రీన్ క్యారెక్టర్‌ని కూడా తీసుకొచ్చి కాస్త కామెడీ మరియు లవ్ ట్రాక్ సీన్స్ చూపించారు.అయితే రా ఆఫీసర్ అర్జున్ శ్రీకర్‌కి, బ్యాంకు ఏజెంట్ రామకృష్ణకి ఉన్న సంబంధం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో కధ నడుస్తుంది అనేది అర్ధం అవుతుంది. 

ఇక ఈ సినిమా ఎక్కువభాగం పాకిస్థాన్‌ బోర్డర్ లో తీసిన విజువల్స్ ఉన్నాయి  దానివల్ల అక్కడక్కడా గోపీచంద్ హీరోగా నటించిన సాహసం సినిమా ఛాయలు కూడా కనిపిస్తున్నాయి. 
ఈ సినిమాతో  సునీల్ కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ కూడా ఇందులో నటిస్తుంది.అయితే ఈ సినిమాలో డైరెక్టర్ గోపీచంద్‌ని స్టైలిష్‌గా చూపించడానికి చేసిన ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంది.అలాగే లావిష్ యాక్షన్ ఎంటెర్టైనర్ ఈ సినిమాని తెరకెక్కించడానికే ప్రాధాన్యత ఇచ్చినట్టు ఈ ట్రైలర్‌ చూస్తేనే స్పష్టంగా అర్ధం అవుతుంది.

అయితే ఒక పక్క పాక్‌లో ఆపరేషన్ కోసం వెళ్లిన మన రా ఏజెంట్‌‌ని మనవాళ్ళే కనిపిస్తే కాల్చెయ్యమని ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారు అనేది ఒక ట్విస్ట్.ఈ సినిమాలో హీరోయిన్ మెహ్రీన్‌ పాత్ర సాదాసీదాగా కనిపిస్తుంది. పాటలు, కామెడీ సీన్స్‌కి మాత్రమే ఆమె నటన పరిమితమైనట్టు అనిపిస్తుంది.చాలా కాలంగా సరైన హిట్టులేని గోపిచంద్ చాణిక్యగా ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదు థియేటర్ లో చూడాలి.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు ఆకటునేలా ఉన్నాయి 


మరింత సమాచారం తెలుసుకోండి: