ప్రముఖ హాస్యనటుడు, మిమిక్రి కళాకారుడు  వేణుమాధవ్ మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న వేణుమాధవ్.. సికింద్రాబాద్‌లోకి యశోద హాస్పిటల్‌లో చేరారు.చికిత్స సమయంలో కిడ్నీ సమస్య కూడా తోడవటంతో బుధవారం  తుదిశ్వాస విడిచారు.వేణుమాధవ్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేధికగా గుర్తు చేసుకుంటున్నారు. వేణుమాధవ్ మరణంపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. వేణు మాధవ్ కెరీర్ తొలి నాళ్లలో టీడీపీ కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్ గా పనిచేసారు. అప్పటి నుండి  ఆ పార్టీ నేతలు,ప్రముఖులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి.ఎన్నికల వేళ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. టీడీపీతో వేణుమాధవ్ కి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు చంద్ర బాబు. మిమిక్రీ కళాకారుడిగా, సినీ హాస్య నటుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన వేణుమాధవ్ మృతి విచారకరం.తెదేపా ఎన్నికల ప్రచారంలోనూ తనదైన ప్రత్యేకతతో ప్రజలని ఆకట్టుకున్నారు వేణు మాధవ్.

వేణుమాధవ్ మృతికి నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు.  ఈ నేపథ్యంలో వేణుమాధవ్ మరణంపై ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.గుంటూరు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. వేణుమాధవ్ మరణం గురించి తెలియడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వేణు మాధవ్మరణం టాలీవుడ్‌కు తీరని లోటన్నారు.వేణుమాధవ్ టీడీపీ, ఎన్టీఆర్‌ను ఎంతో అభిమానించేవారని.. మహానాడులో మిమిక్రీ ప్రదర్శన ద్వారా ఎన్టీఆర్‌ను ఆకట్టుకున్నారని.. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు మహానాడు ప్రదర్శనలో తెలుగు దేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వేణుమాధవ్ అద్భుతంగా చెప్పేవారని అన్నారు.
 సభ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ వేణుమాధవ్‌ను ప్రశంసించారట.    


మరింత సమాచారం తెలుసుకోండి: