తెలుగులో  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలక్షణ నటుడుగా మంచి పేరుంది.గత ఏడాది సావిత్రి బయోపిక్  మహానటి సినిమాలో  ఎస్ వి రంగారావుగారి  పాత్రలో నటించి మెప్పించారు. 
ఆ చిత్రం తరువాత ఆయన మరో తెలుగు చిత్రంలో కనిపించలేదు. ఐతే మోహన్ బాబు తమిళంలో రెండు భారీ చిత్రాలలో నటిస్తున్నారు. అందులో ఒకటి సూర్య హీరోగా తెరకెక్కుతున్న సురారై పోట్రు లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.కాగా  మరొక చిత్రం మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ పొన్నియన్ సెల్వమ్. 

తమిళ సీనియర్ దర్శకుడు మణిరత్నం ఎప్పటినుంచో తెరకెక్కించాలనుకుంటున్న 'పొన్నియన్ సెల్వం' చిత్రంలో  మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారట.ఈ చిత్రం ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. విషయం ఏంటి అంటే చోళుల కథ పై వస్తున్నా ఈ సినిమాలో ఐశ్వర్య భర్తగా మోహన్ బాబు నటిస్తున్నారు.
చారిత్రాత్మక నేపథ్యంతో రూపొందనున్న ఈ చిత్రం స్క్రిప్టు అద్భుతంగా ఉంటుంది అంటున్నారు.
 
ఎయిర్ డెక్కన్ ఫౌండర్ కెప్టెన్ జీఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సురారై పోట్రు చిత్రాన్ని గురు ఫేమ్ దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ రూపొందిస్తున్నది.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ,ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కీర్తి సురేష్, అమలా పాల్ నటిస్తున్నారు. 

ఇది మణిరత్నం  డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో దానికి తగ్గ నటీనటుల్ని జాగ్రత్త గా ఎంపిక చేస్తున్నారు .గతంలో ఈ సినిమాని మహేష్ బాబుతో తెరకెక్కించాలని ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయోగాన్ని విరమించుకున్నాడు మణిరత్నం.గతంలో 'విలన్'తో నిరాశపరిచిన విక్రమ్, మణిరత్నం కాంబో 'పొన్నియన్ సెల్వం' తోనైనా విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.


    మరింత సమాచారం తెలుసుకోండి: