టాలీవుడ్ స్టార్ హీరోలు మ‌హేష్‌బాబు వ‌ర్సెస్ బ‌న్నీ మ‌ధ్య ఇప్పుడు ఇంట‌ర్న‌ల్ వార్ న‌డుస్తోందా ? అంటే ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్ లో అవున‌నే ఆన్స‌ర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్ద‌రు హీరోలు న‌టించిన సినిమాలు సంక్రాంతి రేసులో ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఇప్పుడు ఈ విష‌యం ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సైడ్‌లో బ‌లంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. వ‌చ్చే సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటిలో జ‌న‌వ‌రి 10న రజనీ 'దర్బార్', 11న మహేష్ 'సరిలేరు', 12న బన్నీ 'అల' సినిమాలు విడుదలవుతున్నాయి. ఇవికాక, కళ్యాణ్ రామ్, విశాల్ ల సినిమాలు కూడా వున్నాయి.


ఇక ఒకేసారి ఇన్ని సినిమాలు అంటే థియేట‌ర్ల కొర‌త ఖ‌ఛ్చితంగా ఉంటుంది. ఇక థియేట‌ర్ల పంచాయితీలు ఎలా ?  ఉంటాయో ?  ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముందుగా మ‌హేష్ సినిమాను జ‌న‌వ‌రి 11న రిలీజ్ చేస్తున్న‌ట్టు చెప్పారు. ఇక బ‌న్నీ సినిమాను 12న అనుకున్నారు. స‌రిలేరు నీకెవ్వ‌రు షూటింగ్ ఇప్ప‌టికే చాలా స్పీడ్‌గా న‌డుస్తోంది. అందుకే మ‌హేష్ సినిమా మేక‌ర్స్ 11న డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇక బ‌న్నీ - త్రివిక్ర‌మ్‌ల అల వైకుంఠ‌పురంలో 12న డేట్ ఎప్పుడో ఫిక్స్ చేసుకుంది.


మ‌హేష్ సినిమా 11న వ‌స్తుండ‌డంతో బ‌న్నీ సినిమాను 14న రావాల‌ని సూచించ‌గా.. బ‌న్నీ సినిమా మేక‌ర్స్ మాత్రం తాము 12నే వ‌స్తామ‌ని చెప్పార‌ట‌. చివ‌ర‌కు మ‌హేష్ త‌మ సినిమాను 14న రిలీజ్ చేద్దామ‌ని ముందు అనుకున్నా.. ఆ త‌ర్వాత బ‌న్నీ సినిమా ఏ రోజున వ‌స్తే అదే రోజు రావాలని.. ఈ విష‌యంలో ఎంత మాత్రం వెన‌క్కు త‌గ్గ‌కూడ‌ద‌ని డిసైడ్ అయ్యార‌ని స‌మాచారం. ఈ ఇద్ద‌రిలో ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గ‌క‌... ఇద్ద‌రు హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే వార్ అదిరిపోవ‌డం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: