‘భాగమతి’ మూవీ తరువాత అనుష్క నటించిన సినిమా ఒక్కటి కూడ విడుదల కాకపోయినా ఆమె క్రేజ్ చెక్కు చెదరలేదు. దీనితో ఆమెతో సినిమాలు చేయాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నా ఆమె లేటెస్ట్ గా నటిస్తున్న ఒక్క ‘నిశ్శబ్దం’ మూవీ తప్ప మరే సినిమా ఒప్పుకోలేదు. 

ప్రస్తుతం ఆమె నటించవలసిన గౌతమ్ మీనన్ మూవీ ఆ దర్శకుడుకి వచ్చిన ఆర్ధిక కష్టాలు వల్ల ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితులలో మణిరత్నం తీయబోతున్న భారీ మూవీలో అనుష్క నటిస్తోంది అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను అనుష్క కూడ పరోక్షంగా అంగీకరించింది. అయితే ఆమె మణిరత్నం మూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం సంచలనంగా మారింది. 

సాధారణంగా మణిరత్నం సినిమాలను తిరస్కరించే సాహసం పేరున్న హీరో హీరోయిన్స్ ఎవరు చేయరు.  అనుష్క ఇలాంటి సాహసం చేయడానికి ఒక ఆసక్తికర కారణం ఉంది అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు అనుష్క ఈ మూవీ ప్రాజెక్ట్ ను వదులు కోవడం వెనుక సమంత ఆత్మ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి అని అంటున్నారు. మణిరత్నం సినిమాకు తమిళ లెజెండరీ లిరిసిస్ట్ వైరముత్తు పాటలు రాస్తున్న నేపధ్యంలో వైరముత్తు ఇన్వాల్వ్ ఎలాంటి మూవీలోను అనుష్క భాగస్వామి కాకూడదు అని నిర్ణయించుకుందట. 

దీనికి కారణం గాయని డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి వైరముత్తు పై  గత ఏడాది పెద్ద ఎత్తున లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణల పై ఆమె ఎటువంటి ఆధారాలు చూపించ లేకపోయినా ఈ వివాదం దక్షిణ భారత సినిమా రంగాన్ని కుదిపి వేసింది. ఇలాంటి పరిస్థితులలో అలాంటి వివాదాస్పద వ్యక్తి ఇన్వాల్వ్ అవుతున్న సినిమా ఎంత పెద్దది అయినా తాను నటించకూడదు అన్న నిర్ణయంతో అనుష్క మణిరత్నం ను తిరస్కరించింది అంటూ మీడియాలో వార్తలు  వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: