తెలుగులో మల్టీ స్టారర్, ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ సినిమాలంటే వెంకీ ముందు వరుసలో ఉంటాడు. 'ఎఫ్‌ 2' విజయంతో తాను ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ కామెడీ చేస్తే ఇప్పటికీ కోట్ల రూపాయల వసూళ్లు కళ్లు మూసుకుని వచ్చేస్తాయని నిరూపించుకున్నాడు వెంకటేష్. అందుకే కామెడీకి ప్రాధాన్యమున్న కథల కోసం అన్వేషిస్తున్నారు.  అలాగే ఓల్డ్ ఏజ్ లో కూడా కుర్ర క్యారెక్టర్లు కాకుండా తన ఏజ్ కి తగ్గ పాత్రలు చేయడానికే మొగ్గు చూసుపుతున్నాడు.   

 ఈ క్రమంలో ఆయనకి బాలీవుడ్‌లో వచ్చిన 'దే దే ప్యార్‌ దే' చిత్రం నచ్చింది. ఈ సినిమాలో యాభై ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయితో ప్రేమలో పడే హీరో పాట్లు బాగా నవ్విస్తాయి. దీంతో ఈ సినిమా లో తన ఏజ్‌కి ఆ క్యారెక్టర్‌ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నాడు వెంకీ. ఆ చిత్రం రైట్స్‌ తీసుకోమని కూడా తన అన్నయ్య సురేష్ బాబుకి చెప్పారట.
కానీ ఈలోగా నాగార్జున హీరో గా వచ్చిన మన్మథుడు 2 సినిమా  డిజాస్టర్‌ అయింది. 

ఆ చిత్రంలో నాగార్జున కూడా ఇంచుమించు ఇదే తరహా పాత్ర చేసాడు. అది తన ఇమేజ్‌కి భంగం కలిగించడమే కాకుండా పలు విమర్శలకి గురి అయ్యారు నాగ్. ఇప్పుడు తన ఇమేజ్‌ని డామేజ్ చేసే అలంటి కథాంశాలు కరక్ట్‌ కాదని వెంకీ డ్రాప్‌ అయినట్టు తెలుస్తుంది. 


ప్రస్తుతానికి వెంకీ మామ తప్ప ఆయన మరే చిత్రం చేయడం లేదు. సోలో హీరోగా నటించినా కానీ తన వయసుకి తగ్గ కథలతోనే రమ్మని డైరక్టర్ల కి చెబుతున్నారట వెంకీ. విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’. రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లు.వెంకటేష్ అభిమానులకు, అటు అక్కినేని ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే ఫొటోలు కొన్ని ఆ మధ్య  సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.


    మరింత సమాచారం తెలుసుకోండి: