ప్రస్తుత రోజులలో సినిమాలు, సీరియల్స్ మరిచిపోయి ఆన్ లైన్ లో వస్తున్న వెబ్ సిరీస్ ల మీద ఆసక్తి రోజు రోజుకి అందరికి పెరిగిపోతుంది. ఇంకా అసలు విషానికి వస్తే మన భారతదేశ నటి మాజీ విశ్వ సుందరి ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో పలు టీవీ సిరీస్ లలో నటిస్తూ వేడి పెంచిన సంగతి విధితమే.క్వాంటికో సిరీస్ తో ఈ మాజీ విశ్వ సుందరికి వచ్చిన పేరు అంత ఇంత కాదు. దేనితో తన పేరును హాలీవుడ్ లో బాగా వినిపించే విధంగా చేసుకుంది. అంతేకాకుండా అమెరికా సింగర్ నిక్ జోనాస్ తో ప్రేమలో పడి ఏకంగా తనకంటే వయస్సులో చిన్నవాడిని పెళ్లి కూడా అంగరంగ వైభవంగా చేసుకుంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా మరో క్రేజీ వెబ్ టీవీ సిరీస్ కి సంతకం చేసిన సంగతి తెలిసిందే.


ఇక మన సౌత్ ఇండస్ట్రీ విషయానికి వస్తే స్టైలింగ్ లో సెలక్షన్ లో ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ బాటను అనుసరించే సౌత్ కథానాయికగా అక్కినేని సమంతకు పేరుంది. అక్కినేని కోడలు అయ్యాక సామ్ ప్లానింగ్ మొత్తం మార్చేసింది. తాను పూర్తిగా నటనకు స్వస్థి చెప్పాల్సిన పనే లేకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తోంది. అలాగే భర్త అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించే సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది.


ఇది ఇలా ఉండగా పనిలో పనిగా క్రేజీ వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేయడం రూటు మార్చిందని చెప్పవచ్చు.సమంత ఒక వెబ్ సిరీస్ కి సంతకం చేసిందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అది ఎక్కడ ఎవరి దర్శకవత్వం అన్నదాని పై పూర్తి స్పష్ఠత లేదు. తాజా సమాచారం ప్రకారం మనోజ్ బాజ్ పాయ్ నటిస్తున్న ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రను పోషించేందుకు సమంత అంగీకరించిందని తెలుస్తోంది. ఇదే సిరీస్లో హీరోయిన్ ప్రియమణి కూడా ఒక కీలక పాత్రను పోషిస్తోంది అని సమాచారం. బాలీవుడ్ లో స్థిరపడ్డ తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు అని సమాచారం.ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లాంచ్ అయ్యింది. ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సిరీస్ లో సామ్ సడెన్ ఎంట్రీ ఇస్తోందా? లేదా? ప్రీప్లాన్డ్ గానే వెళుతోందా అన్నది తనే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ టాపిక్ తెలుగు యాక్టర్లలో మంచి ట్రెండింగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: