‘సైరా’ ప్రముఖ తమిళ పత్రిక ‘ఆనంద వికటన్’ కు ఇంటర్వ్యూ ఇస్తూ చిరంజీవి ఎన్నికలలో ధన ప్రవాహం చాల పెరిగి పోయిందని ఇలాంటి పరిస్థితులలో రాజకీయలలోకి సినిమా స్టార్స్ వచ్చినా రాణించరని అందువల్ల రజనీకాంత్ కమలహాసన్ లను రాజకీయాలలోకి రావద్దు అంటూ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు కమలహాసన్ రజనీకాంత్ ల మనస్తత్వం నేటి రాజకీయాలకు సరుపోదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

రాజకీయాలలో ఫెయిల్ అయిన తన అనుభంతో ఈసలహాలు ఇస్తున్నాను అన్న చిరంజీవి మాటల పై కమలహాసన్ ఘాటుగా స్పందించాడు. రాజకీయాల్లోకి రావద్దంటూ చిరంజీవి ఇచ్చిన సలహాకు కృతజ్ఞతలు. అయితే గెలుపు ఓటముల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని కమల్ హాసన్ స్నష్టం చేశాడు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే తాను వచ్చానని చెపుతూ తనకు ఎప్పుడు ఈ విషయాల పై చిరంజీవి సలహాలు అవసరం లేదు అంటూ కామెంట్ చేసాడు. 

అంతేకాదు ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తన ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని. ప్రజల ఆలోచన ధోరణి పై తనకు అవగాహన పెరిగిందని కామెంట్ చేసాడు. వాస్తవానికి చిరంజీవి ‘సైరా’ మూవీ తమిళ వెర్షన్ కు వాయస్ ఓవర్ కమలహాసన్ రజనీకాంత్ లలో ఎవరో ఒకరిచేత ఇప్పించాలని చాల గట్టి ప్రయత్నాలు చేసాడు. అయితే కమల్ రజనీకాంత్ ఆ ప్రతిపాదనకు పెద్దగా స్పందించలేదు అన్న వార్తలు ఉన్నాయి. 

దీనితో కమల్ రజనీకాంత్ లు రాజకీయాలకు సరిపోరు అంటూ చిరంజీవి కామెంట్స్ చేసి ఉంటాడు అంటూ తమిళ మీడియా ఊహాగానాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో కమల్ రంగంలోకి దిగి చిరంజీవి మాటలకు ఇచ్చిన గట్టి కౌంటర్ ను తమిళ మీడియా చాల ప్రముఖంగా కవర్ చేసింది. యధాలాపంగా చిరంజీవి అన్న మాటలు ఇప్పుడు అతడికి సమస్యలు తెచ్చి పెట్టాయి అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: