మెగా ఫ్యామిలీ హీరో వ‌రుణ్ తేజ్ వ‌రుస‌గా మంచి క‌థ‌లు ఎంపిక చేసుకుంటూ దూసుకు పోతున్నాడు. సినిమా సినిమాకు వ‌రుణ్ రేంజ్‌, క్రేజ్‌, మార్కెట్ పెరిగిపోతున్నాయి. ఈ యేడాది ఇప్ప‌టికే సంక్రాంతికి వెంక‌టేష్‌తో క‌లిసి ఎఫ్ 2 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన వ‌రుణ్ ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో చేసిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టేశాడు.


కోలీవుడ్ హిట్ మూవీ జిగ‌ర్తండాకు రీమేక్‌గా వ‌చ్చిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ఎక్కువుగా బి,సి సెంటర్స్ లో ప్రేక్షకులను ఎక్కువుగా ఆకట్టుకుంటుంది. ఏపీ, తెలంగాణ‌లో 10 రోజుల‌కు దాదాపుగా రు.21 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఈ సినిమా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వ‌చ్చేసింది. ఇక మ‌రో రోజులో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.


ఆ మ‌రుస‌టి రెండు రోజుల‌కే గోపీచంద్ చాణ‌క్య వ‌స్తోంది. ఈ రెండు సినిమాల పోటీగా గ‌ణేష్ కాస్త స్లో అయిపోతుంద‌నే చెప్పాలి. ఏదేమైనా ఈ సినిమాతో వ‌రుణ్ తేజ్ త‌న మార్కెట్ మ‌రింత స్టాండ‌ర్డ్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా ఓవ‌ర్సీస్లో సైతం అనుకున్న క‌లెక్ష‌న్ల‌కు మించి వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం విశేషం. ఏదేమైనా వ‌రుణ్‌తేజ్ టైర్ 2 హీరోల్లో టాప్ రేంజ్‌కు వెళ్లిపోతున్నాడు.


' గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ '  10 డేస్ ఏరియా వైజ్‌ కలక్షన్ల షేర్ వివరాలు (రూ.కోట్ల‌లో) :


నైజాం – 7.78 కోట్లు


సీడెడ్ – 3.53 కోట్లు


వైజాగ్ – 2.51 కోట్లు


కృష్ణ – 1.40 కోట్లు


గుంటూరు – 1.72 కోట్లు


నెల్లూరు – 0.86 కోట్లు


ఈస్ట్ – 1.63 కోట్లు


వెస్ట్ – 1.41 కోట్లు
----------------------------------------------------------
ఏపి & తెలంగాణ 10 రోజుల షేర్ : 20.84 కోట్లు
-----------------------------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: