మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా అక్టోబర్ 2 ఆ తేదీన రిలీజ్ కాబోతున్నది.  దానికంటే ముందే అక్టోబర్ 1 వ తేదీ అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడతాయి.  అటు అమెరికాలో కూడా ప్రీమియర్ షో కోసం సైరా రెడీ అవుతున్నది.  రికార్డు స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం యావత్ మెగాస్టార్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.  దాదాపు 270 కోట్ల రూపాయల ఖర్చుతో సినిమాను నిర్మించారు.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఈ మూవీ కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  


సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అందరిలోనూ కలిగింది.  దక్షిణాది అన్ని భాషలతో పాటు, హిందీలోకూడా సినిమా రిలీజ్ కాబోతున్నది.  అయితే, హిందీ భాషలో మెగాస్టార్ వాయిస్ చాలా బాగుంది.  డబ్బింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.  గాంబీర్యంతో కూడిన వాయిస్ చెప్పారు.  మెగాస్టార్ కు హిందీలో డబ్బింగ్ చెప్పింది ఎవరో ఆ టీమ్ బయటపెట్టకపోయినా.. ఇటీవలే ఆ విషయం బయటకు వచ్చింది.  


మెగాస్టార్ కు హిందీలో డబ్బింగ్ చెప్పింది మరెవరో కాదు.. గోపీచంద్ చాణక్య సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్న రాజేష్ ఖట్టర్ అని తెలిసింది.  ఈ విషయాన్ని ఖట్టర్ చాణక్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పేర్కొన్నాడు.  బాలీవుడ్ లో మొదట ఖట్టర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.  తరువాత ఖట్టర్ స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా పనిచేశారు.  అనంతరం అవకాశాలు రావడంతో ఖట్టర్ నటుడిగా మారారు.  


ఇప్పుడు టాలీవుడ్ లో గోపిచంద్ స్పై థ్రిల్లర్ సినిమా చాణక్యలో విలన్ గా నటిస్తున్నారు.  సో, బాలీవుడ్ లో మెగాస్టార్ ను తన గొంతుతో ముందుకు నడిపిస్తున్నారు ఖట్టర్.  సైరా సినిమా అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతుంటే.. గోపిచంద్ చాణక్య సినిమా అక్టోబర్ 5 రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  మొత్తానికి ఈ రెండు సినిమాలు పోటీ పడబోతున్నాయి.  అయితే, గోపిచంద్ సినిమాలకు థియేటర్లు ఇవ్వొద్దని ఇప్పటికే ఒత్తిడి పెరిగిందని, బడా నిర్మాతలు థియేటర్లకు ఫోన్ చేసి చెప్తున్నారని అంటున్నారు.  ఇది అన్యాయం కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: