పూరి జగన్నాధ్’ సినిమాలు అంటే హీరో, హీరోయిన్ ని ఫేమస్ చేయడానికి మాత్రమే తీస్తాడు… అందుకే హీరో, హీరోయిన్స్ పూరి తో సినిమా తియ్యడానికి తెగ తాపత్రయ పడతారు. 
‘ఆంధ్ర పోరి’ , ‘మెహబూబా’ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యడంటా పూరి తనయుడు ఆకాష్ పూరి. 
 
తనయుడు ఆకాష్ పూరి తో  ‘కేతికశర్మ’ కథానాయిక  తెలుగు పరిశ్రమకి పరిచయం చేస్తున్నాడు పూరి. ‘మెహబూబా’ సినిమా ద్వారా తనయుడు పరిచయం అయ్యి హిట్ కొడతారు అనుకున్నారు, కానీ సినిమా గోరా పరాజయం పాలు అయ్యింది. దానికి దర్శకుడు మన పూరీనే.అయితే ఇప్పుడు తనయుడికి హిట్ అవసరం అని చెప్పి, తన నిర్మాణంలో ‘ఛార్మి’ తో కలిసి ఒక  చిత్రాన్ని నిర్మిస్త్తున్నాడు.

ఆ సినిమా పేరు “రొమాంటిక్”, ‘అనిల్ పాదూరి’ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి  సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 
ఇలా ఈ సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు అనిల్ కూడా సినిమాని ఈ తరం యువతకి నచ్చేలా చిత్రీకరించారు.కాగా ఈ రోజు సినిమాలోని పోస్టర్ ని రిలీజ్ చేసారు పూరి. అందులో తనయుడు ఆకాష్ పూరి అమ్మాయిని ఘాటుగా వాటేసుకున్నాడు. సినిమా పేరు కూడా రొమాంటిక్ అయ్యి ఉండటం చూస్తుంటే, పూరి గారు తనయుడిని ఈ సారి రొమాంటిక్ గా చూపించాలని డిసైడ్ అయినట్టున్నారు అనిపిస్తుంది.

చూద్దాం మరీ పూరి జగన్నాధ్ గారు ప్రతి సినిమాలో రొమాంటిక్ కథానాయకుడిని చూపించినట్టుగా ఈ సినిమాలో తన కొడుకుని వేరొక దర్శకుడితో ఎలా డిజైన్ చేసాడో ఏమో? 
మొత్తానికి సినిమాకి ఈ రకంగా హైప్ రావడం ప్రమోషన్ లో భాగమే అంటున్నారు.


    మరింత సమాచారం తెలుసుకోండి: