మెగాస్టార్ చిరంజీవి నటించిన  భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీ సైరా  నర్సింహా రెడ్డి మరి కొన్ని గంటల్లో  ప్రేక్షకులముందుకు రానుంది.  సాహో తరువాత  టాలీవుడ్ నుండి పాన్ ఇండియా సినిమాగా  వస్తున్న సైరా పై   ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈచిత్రం  తెలుగు రాష్ట్రాల్లో  1200 థియేటర్లలో విడుదలవుతుండగా  మిగితా అన్ని భాషల్లో కలుపుకొని దేశ వ్యాప్తంగా  3600 థియేటర్లలో విడుదలకానుంది.



అలాగే ఓవర్సీస్ లో 1000 కిపైగా థియేటర్లలో  విడుదలకానుండగా  మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు 4600కు పైగా  థియేటర్లలో సందడి చేయనుంది. ఈలెక్కన సైరా  మొదటి రోజు 40నుండి 50కోట్ల  గ్రాస్ ఓపెనింగ్ ను రాబట్టేలా కనిపిస్తుంది. అయితే ఈ చిత్రానికి  హృతిక్ రోషన్  , టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన  వార్ రూపంలో   తీవ్ర పోటీ ఎదురుకానుంది. ఆచిత్రం  కూడా రేపు భారీస్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో  హిందీలో సైరా  మొదటి రోజు అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోవచ్చు.



సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తొలి తరం  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా  తెరకెక్కిన ఈ చిత్రంలో  నయనతార కథానాయికగా నటించగా  అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , రవికిషన్ , జగపతి బాబు ,  సుధీప్ , తమన్నా  ముఖ్య పాత్రలు పోషించారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ చిత్రాన్ని  సుమారు 270 కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై హీరో రామ్ చరణ్ నిర్మించాడు.  మరి భారీ హైప్ తో  విడుదలవుతున్న సైరా ప్రేక్షకులనుండి ఎలాంటి రెస్సాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: