సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చిన్నగా అడుగులు వేసి మెగాస్టార్ గా ఎదిగిన హీరో చిరంజీవి.  చిరంజీవి మాస్ లో ఎలాంటి ఇమేజ్ ఉన్నదో చెప్పక్కర్లేదు.  ఈ హీరో ఎన్నో సినిమాలు చేశారు.  149 సినిమాలు చేసిన తరువాత మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీని స్థాపించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.  సినిమారంగానికి దూరం కావడం చాలామంది నిర్మాతలకు ఇష్టం లేదు.  మెగాస్టార్ కు ఎదురు చెప్పలేరు. 

అందుకే సైలెంట్ గా ఉన్నారు.  ఏడేళ్లు రాజకీయాల్లో ఉన్న తరువాత మెగాస్టార్ కమ్ బ్యాక్ గా తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలి అనుకున్నాడు.  మెగా నిర్మాత అల్లు అరవింద్ తో సినిమా చెయ్యొచ్చు.  అందుకు అల్లు అరవింద్ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు.  కానీ, కమ్ బ్యాక్ మూవీ ఏదైనా బెడిసికొడితే.. అల్లు అరవింద్ నష్టపోవాల్సి వస్తుంది.  అది మెగాస్టార్ కు ఇష్టం లేదు.  ఇది గమనించిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మారాలని అనుకున్నాడు.  


తండ్రికోసం సొంతంగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ స్థాపించాడు.  తమిళంలో సూపర్ హిట్టైన సినిమాను రీమేక్ హక్కులు తీసుకొని ఖైదీ నెంబర్ 150 ప్లాన్ చేశారు.  మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ సూపర్ హిట్ అయ్యింది.  దీంతో మెగాస్టార్ సినిమాలకు వరసగా నిర్మాతగా మారి చిత్రాలు నిర్మించాలని అనుకున్నాడు చరణ్.  మెగాస్టార్ 13 సంవత్సరాల నుంచి కలగా ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను నిర్మించాలని అనుకున్నాడు.  


భారీ బడ్జెట్ అవుతుంది అయినా వెనకడుగు వేయకుండా మెగాస్టార్ సినిమాను నిర్మించారు.  రేపు సినిమా రిలీజ్ కాబోతున్నది.  పెట్టిన డబ్బు తెరపై స్పష్టంగా కనిపించబోతున్నది.  ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం భారీగా జరగడంతో.. సినిమాకు ప్లస్ అయ్యింది.  సినిమా భారీ రికార్డులు సాధించడం ఖాయం అని అంటున్నారు.  బాలీవుడ్ లో కూడా రిలీజ్ కాబోతున్నది కాబట్టి సినిమాకు అదనపు ఆదాయం లభిస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: