వెండి తెర పట్ల కానీ, బుల్లి తెర పట్ల కానీ మీకేమైనా ఆసక్తి ఉందా.. ఉంటే ఎలా అప్రోచ్ కావాలో తెలియడం లేదా.. అయితే ఆసక్తి కలిగిన మీరందరికి చక్కని మార్గం చూపించేందుకు దూరదర్శన్ ఎక్స్ న్యూస్ రీడర్ మహమ్మద్ షరీఫ్ ఇక చక్కని వేదికను కల్పించారు. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు కదా..అసలు ఆయన ఇచ్చేస్తున్నాడో ఒక సారి తెలుసుకుందా. యాక్టింగ్, న్యూస్ రీడింగ్, యాంకరింగ్, దర్శకత్వం, స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్ లలో తర్ఫీదు ఇచ్చేందుకు హైదరాబాద్ కు చెందిన ఆయా రంగాల్లో నిష్ణాతులైన శిక్షకులు ముందుకు వచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమం ఆసాంతం. 


ప్రముఖ ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ఎక్స్ న్యూస్ రీడర్,టీవీ అండ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్, మహమ్మద్ షరీఫ్ పర్యవేక్షణలో జరగనున్నది. ఆయన  నిర్వహణలో అక్టోబర్ 5  వ తేదీ నుంచి 30 రోజులపాటు శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు పొందిన ప్రముఖులచే ఈ శిక్షణ ఇవ్వబడుతుందని చేబుతున్నారు. శిక్షణ అనంతరం ప్రతిభావంతులకు తాము నిర్మించే  లఘు చిత్రాలలో, టీవి  సీరియల్స్ లో అవకాశం కలిపిస్తామని నిర్వాహకులు షరీఫ్ తెలిపారు.



ఒక నెల శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు. చలన చిత్ర పరిశ్రమ పట్ల ఆసక్తి కలిగిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని షరీఫ్ కోరారు. ఈ శిక్షణ తరగతుల గురించి మరిన్నీ వివరాలు తెలుసుకోగోరువారు  గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ, పూజా అపార్ట్మెంట్, జిహెచ్ ఎంసి వార్డ్ ఆఫీస్ ఎదుట, ఖైరతాబాద్ కార్యలయంలో గానీ,  లేదా మొబైల్ నెంబర్ 9441327504,  వాట్సాప్ నెంబర్ 8328670261 లలో గానీ సంప్రదించవచ్చని షరీఫ్ సూచించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: