మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశమే హద్దుగా ఉంటాయి.  అదే చిరంజీవి ఓ పాన్ ఇండియా సబ్జెక్ట్ చేస్తే.. ఆ సినిమాకు ఇండియా వైడ్ గా హైలెవల్ బజ్ వస్తే.. ఇంక ఆ సినిమా కోసం అభిమానుల ఆరాటం, ప్రేక్షకుల ఎదురుచూపులు చెప్పనలవి కాదు. చిరంజీవి హీరోగా నటించిన సైరా పరిస్థితి అలానే ఉంది. ఈ సినిమాపై దేశం మొత్తం దృష్టి ఉంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


తెలుగు నుంచి వస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతోంది. కారణం ఇటివలే ప్రభాస్ నటించిన సాహో క్రియేట్ చేసిన బజ్, రెండేళ్ల క్రితం బాహుబలి సృష్టించిన విధ్వంసమే కారణం. చిరంజీవి కూడా బాలీవుడ్ లో సుపరిచితమే. దీంతో తెలుగు నుంచి వస్తున్న సైరాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సాహో సినిమాపై అంచనాలు పెరిగిపోవటానికి బాహుబలి సిరీస్ కారణం. ఆ సినిమాతో ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు. దీంతో సాహోకు మార్కెట్ పెరిగి సినిమాకు 250 కోట్ల బడ్జెట్ వరకూ పెట్టి తీసారు. బాలీవుడ్ లో కలెక్షన్లు వచ్చినా సాహో ఫ్లాప్ మూవీగా నిలిచింది. కారణం తెలుగుతో పాటు ఎక్కడా ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ దక్కలేదు. ఇప్పుడు అందరి చూపు సైరాపై పడింది. ఈ సినిమాపై చిరంజీవి ఎఫెక్ట్, తొలి స్వాతంత్య్ర సమరయోధుడు అనే ట్యాగ్ మాత్రమే ఉంది. ఈ సినిమాపై ఈ ఎఫెక్టే తప్ప అంతకు ముందు క్రియేట్ అయిన బజ్ లేదు. కాబట్టి ఈ సినిమాను ప్రేక్షకులు ఓ సినిమాగా మంచి కథను ఎక్సపెక్ట్ చేసుకుని చిరంజీవి మ్యాజిక్ కోసం వెళతారు. కాబట్టి సైరాకు హిట్ టాక్ పడిందంటే ఓ రేంజ్ కలెక్షన్లతో దూసుకుపోవటం ఖాయం.


అతి తక్కువ కాలంలో ప్రమోషన్లతో అదరగొట్టేసిన చిరంజీవి, రామ్ చరణ్ సినిమాపై అంచనాలను బాగా పెంచారు. తాము పడిన కష్టం, సినిమా కంటెంట్ ను ప్రేక్షకుల్లోకి బాగా తీసుకెళ్లారు. చిరంజీవి తన సినిమాలకు ప్రమోషన్స్ 40శాతం చేసుకుంటే చాలు.. మిగిలిన 60శాతం ప్రమోషన్ల సంగతి చూసుకునే మెగా అభిమానగణం ఆయన సొంతం. కాబట్టి సైరాపై ఒత్తిడి లేదు. కావలిసిందల్లా హిట్ టాక్ మాత్రమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: