సైరా మరికొన్ని గంటల్లోనే రిలీజ్ కాబోతున్నది.  అభిమానుల్లో తెలియని ఉత్కంఠత మొదలైంది.  ఉత్కంఠతతో పాటు సినిమా ఎలా ఉంటుందో అనే టెన్షన్ కూడా ఉన్నది.  ఇక స్పెషల్ షోలకోసం థియేటర్లు సిద్ధం అవుతున్నాయి.  చెన్నైలో రేపు ఉదయం 8 గంటలకు స్పెషల్ షోలు వేస్తున్నారు.  అయితే, ఏపీ, తెలంగాణలో స్పెషల్ ప్రీమియర్ షోలు వేస్తున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది.  ఏ సినిమాకు సంబంధించిన ఎలాంటి చిన్న న్యూస్ అయినప్పటికీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నది.  


ఈ సినిమాలో జాతరకు సంబంధించిన ఓ సాంగ్ ఉన్నది.  దీన్ని భారీ ఎత్తున నిర్మించారు.  దాదాపు 14 రోజులపాటు ఈ సాంగ్ ను షూట్ చేశారట.  ఈ సాంగ్ లో 4500మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు.  ఈ స్థాయిలో జూనియర్ ఆర్టిస్టులతో సాంగ్ ను షూట్ చేయడం ఇదే మొదటిసారి.  4500 మంది డ్యాన్సర్లతో సాంగ్ ను షూట్ చేయడం అంటే మాములు విషయం కాదు.  సినిమాలో ఈ సాంగ్ కు చాలా ప్రత్యేకత ఉన్నట్టు సమాచారం.  


సినిమాలో ఈ సాంగ్ చాలా కీలకం అని, అందుకే ఆ సాంగ్ ను ఆ స్థాయిలో చిత్రీకరించారట.  స్పెషల్ గా ఉండాలని, అందుకోసమే సాంగ్ ను అలా షూట్ చేశామని యూనిట్ ఇప్పటికే స్పష్టం చేసింది.  ఈ సాంగ్ ఎప్పుడు వస్తుంది.. ఏ స్సందర్భంలో వస్తుంది అన్నది సినిమా రిలీజైతేగాని తెలియదు.  మూవీపై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి.  దాదాపు 270కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు.  


పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీలో అన్ని భాషలకు చెందిన నటీనటులు ఉండటం విశేషం.  మెగాస్టార్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన మూవీగా చిత్రీకరణ జరిగింది.  విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా సినిమాకు ప్రాధాన్యత ఉంది.  ఇందులో 3300 విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ను వినియోగించారు.  ఆ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ను వియోగించినా..వాటిలోని ఎమోషన్స్ మిస్ కాకుండా చూసుకోవడంలో దర్శకుడు సక్సెస్ సాధించాడని రాజమౌళి చెప్పడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: