సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా రేపు విడుదల కాబోతుంది. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు 285 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా అన్ని భాషల్లో 200 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. శాటిలైట్, డిజిటల్ హక్కులు 100 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. 
 
తెలుగులో సైరా సినిమాకు పెద్దగా పోటీ లేదు. వెంకటేష్, నాగచైతన్య కలిసి నటించిన వెంకీమామ సినిమాను అక్టోబర్ 4వ తేదీన విడుదల చేద్దామని నిర్మాతలు భావించినా ఆ తరువాత రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశారు. గోపీచంద్ నటించిన చాణక్య సినిమా అక్టోబర్ 5వ తేదీన విడుదల కాబోతున్నప్పటికీ ఈ సినిమా సైరాకు ఏ మాత్రం పోటీనిచ్చే సినిమా కాదు. కానీ సైరా సినిమాతో పాటు తమిళంలో రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. 
 
ధనుష్, వేట్రిమారన్ కాంబినేషన్లో తెరకెక్కిన అసురన్ సినిమా అక్టోబర్ 4వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా తమిళంలో భారీ స్థాయిలో విడుదల కాబోతుందని తెలుస్తుంది. అసురన్ సినిమా ట్రైలర్ కు తమిళ ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాతో పాటు తెలుగులో నాగ చైతన్య, తమన్నా కలిసి నటించిన 100% లవ్ సినిమా తమిళంలో రీమేక్ అయింది. 
 
జీవీ ప్రకాశ్ షాలిని పాండే కలిసి నటించిన 100% లవ్ సినిమా 100% కాదల్ పేరుతో రీమేక్ అయింది. ఈ సినిమాపై కూడా తమిళంలో భారీగా అంచనాలు ఉన్నాయి.అక్టోబర్ 4వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలకు హిట్ టాక్ వస్తే మాత్రం తమిళంలో సైరా సినిమాకు కష్టమేనని చెప్పవచ్చు. తమిళ నటుడు విజయ్ సేతుపతి సైరా సినిమాలో నటించటం వలన తమిళంలో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రేపు విడుదల కాబోయే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: