రవిబాబు మాష్టర్ అంటే ముందు గుర్తుకు వచ్చేది మనకి హారర్ సినిమాలే.ఇక రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అనసూయ, నచ్చావులే, అనసూయ, అవును’ లాంటి చిత్రాలతో అందరిని ఆకటుకున్నారు.
అదే ఇమేజ్ తో రవిబాబు దర్శకత్వంలో తాజాగా రాబోతున్న చిత్రం ‘ఆవిరి’.ఇటీవల ఈ సినిమా టీజర్స్ రిలీజ్ అయంది అని అందరికి తెలిసిందే. కాగా ఆవిరి సినిమా టీజర్ ను చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఈ సినిమా గురించి స్పందిస్తూ.. ‘అన్ని సినిమాలతో పోలీస్తే ఈ హారర్ జానర్ మూవీసే ఎక్కువుగా ఆసక్తికరంగా ఉంటాయి, చాల ఇంట్రెస్ట్ గా ఉంటాయి అని తెలిపారు.
అలాంటి హారర్ మూవీస్ ను తీయడంలో మొదటి స్థానం రవిబాబు మాష్టర్’.. ‘ఆవిరి’ సినిమా యూనిట్ కి మరియు డైరెక్టర్ రవిబాబుకి ఆల్ ది బెస్ట్’ అని మహేష్ బాబు ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేశారు. ఇక గత సినిమాలు రవిబాబుకి సరైన హిట్ లభించలేదు. ఆయన చివరి ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’ కూడా విజయానికి నోచుకోలేదు.
దీంతో ‘ఆవిరి’ పేరుతో కొత్త ప్రయత్నం తలపెట్టారు రవిబాబు. ‘మీ ఇంట్లో ఎవరికి మీకు తెలియకుండా ఒక ఆత్మ అతిథిగా మీతో పాటే ఉంటే ? ఆ అతిథే ఆవిరైతే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ? అనే కథాతో తెరకెక్కిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లోనూ బాగానే ఆసక్తి లేపుతుంది.ఇక వివరాల్లోకి వెళ్తే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు వినిపిస్తున్నాయి.మరి ఈ సినిమాకి ‘దిల్’ రాజు సమర్పణలో రవిబాబు నటించి, నిర్మించి, దర్శకత్వంలో రాబోతుంది. నేహా చౌహాన్, శ్రీముక్త,
భరణి శంకర్ ముఖ్య పాత్రల్లో పోషిస్తున్నారు. ఈ సినిమా ఐనా రవిబాబుకి హిట్ ఇవ్వాలని కోరుచున్నాము.