పేరు కు ముందు మెగా టాగ్  ఉంటె సరిపోదు టాలెంట్ ఉండాలి. బ్యాక్ గ్రౌండ్ ఎలా ఉన్నా సినీ గ్రౌండ్ లో సత్తా చాటకపోతే రాణించలేరు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐన, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఐన ప్రేక్షకులను తమ నటనతో ఆకట్టుకొని స్టార్స్ గా ఎదిగారు.ఇక అదే ఫామిలీ నుండి మెగా స్టార్  చిరజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్..ఆ మధ్య విజేత సినిమా తో మెగా ఎంట్రీ ఇచ్చాడు. మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండడం తో జనాలు చూస్తారని..సినిమాను హిట్ చేస్తారని గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. 

కానీ జనాలకి ముందు కంటెంట్, తెరపైన కాండిడేట్ బాగా కనెక్ట్ అవ్వాలి. అప్పుడే థియేటర్ కు వస్తారు, ఆదరిస్తారు. లేదంటే   మెగా హీరో అయినా మామూలోడైన సరే సినిమా నచ్చకపోతే ఆ పక్క కు వెళ్లడం కాదు కదా..మిగతావారికి కూడా వెళ్లోద్దని చెపుతున్నారు.  దీంతో విజేత సినిమా దారుణమైన డిజాస్టర్ అయ్యింది. ఆ తరువాత  చాలా కాలం బ్రేక్ తీసుకున్నాడు కళ్యాణ్ దేవ్....ఆ మధ్య ఓ సినిమా మొదలు పెట్టారు. 'మీనాక్షి' అనే వర్కింగ్ టైటిల్ కూడా అనుకున్నారు.

ఓ నలభైశాతం షూటింగ్ ఐన ఈ సినిమా బడ్జెట్ సమస్యో  మరేమయిందో గాని ఆ సినిమా ఆపేసారు. తాజాగా కళ్యాణ్ మరో సబ్జెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మెగా వర్గాలు అంటున్నాయి. రంగస్థలం మాదిరిగా పీరియాడిక్ సినిమా ఇది అని, సినిమాకు కండోమ్ ఫ్యాక్టరీ అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నారని వార్త వినిపిస్తోంది. పులివాసు అనే డైరక్టర్ ఈ సినిమాకు పని చేయబోతున్నట్లు సమాచారం. 1980ల కాలంలో కండోమ్ ఫ్యాక్టరీలో హీరో పని చేయడం వంటి లైన్ తో సినిమా ఉంటుందని టాక్.

మరి ఇది నిజామా..ఎప్పుడు మొదలు పెడతారు..ఈ సినిమాకు సంబందించిన విశేషాలు ఏంటి..అనేవి తెలియాల్సి ఉంది. ఈ సినిమా అయినా మొదలుపెడతాడా..? లేక మధ్యలోనే ఆపేస్తాడో చూడాలి....కానీ సినిమాకి 'కండోమ్ ఫ్యాక్టరీ' అనే టైటిల్ పెట్టడమనేది బోల్డ్ మూవ్ అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: