మెగాస్టార్ చిరంజీవి ఓ మాస్ హీరో.  అయన సినిమాలు మాస్ ఆడియన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చుతాయి.  అందులో సందేహం అవసరం లేదు.  మాస్ ఆడియన్స్ మెచ్చే విధంగా సినిమాలు చేస్తున్నారు కాబట్టి 150 సినిమాలు చేసినా ఇంకా ఆయనకు క్రేజ్ ఉన్నది.  తెలుగులో మెగాస్టార్, సౌత్ లో రజినీకాంత్ కు అలాంటి క్రేజ్ ఉన్నది.  ఇద్దరు ఇద్దరే.  అటు రజినీకాంత్ సైతం 68 ఏళ్ల వయసులో తనదైన స్టైలిష్ తో ఆకట్టుకుంటున్నాడు.  అయితే, మెగాస్టార్ కు పడినట్టుగా రజినీకాంత్ కు మాస్ సినిమా పడటం లేదు. 


అదొక్కటే మైనస్ పాయింట్ అయ్యింది.  ఇప్పుడు మెగాస్టర్ చిరంజీవి 151 వ సినిమా సైరా నరసింహారెడ్డి కొద్దిసేపటి క్రితమే థియేటర్లో రిలీజ్ అయ్యింది.  మూవీపై అంచనాలు ఉన్నట్టుగానే ఆకట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.  సినిమాకు వచ్చిన హైప్ ను చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది.  మెగాస్టార్ రేనాడు ప్రాంతంలోని 64 గ్రామాలకు పెద్ద.  అంటే రాజులాంటి వ్యక్తి.  అతని వెనుక 9000 మంది సైన్యం ఉంటుంది.  


పొలం పనులు చేసుకుంటూ హ్యాపీగా కాలం సాగిపోతున్న ప్రాంతంలో బ్రిటిష్ దొరలు అడుగుపెట్టి అలజడి సృష్టిస్తారు.  అక్కడి నుంచే అసలు కథ మొదలౌతుంది.  సినిమాలో కీ పాయింట్ అక్కడే ఉన్నది. పంటలు పండుతున్నాయి కాబట్టి భూమిపై బ్రిటిష్ వాళ్లకు శిస్తు కట్టాలని, శిస్తు కట్టకుంటే పంటను లాక్కొంటామని చెప్తారు.  దీంతో ఆ ప్రాంతంలో రాజుగా ఉన్న మెగాస్టార్ ఎందుకు కట్టాలిరా శిస్తు అని డైలాగ్ తో మెగాస్టార్ ఎంట్రీ ఉంటుంది.  


మెగాస్టార్ ఎంట్రీతో థియేటర్లలో అరుపులు... కేకలతో నిండిపోతుంది అనడంలో సందేహం అవసరం లేదు.  సినిమా దాదాపుగా చాలా ఎమోషన్ గా సాగినట్టు తెలుస్తోంది.  ప్రతి పాత్రకు ఇందులో ఓ ఇంపార్టెన్స్ ఇచ్చారు.  అది చిన్నది కావొచ్చు పెద్దది కావొచ్చు.  పాత్రలన్నీ అద్భుతంగా ఉన్నాయి.  అందుకే సినిమా బాగుందని టాక్ వస్తోంది.  అంతేకాదు మొదట బాహుబలి దర్శకుడు రాజమౌళి సినిమా చూసి ఒకే చేసిన తరువాత రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సినిమా తప్పనిసరిగా బాగుండి ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: