ఎన్నో అంచనాల మధ్య సైరా రిలీజ్ అయ్యింది.  సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ అవుతుందని... బాహుబలిని బీట్ చేస్తుందని అంచనాలు వచ్చాయి.  కానీ, ఆ అంచనాలు తలక్రిందులైనట్టు కనిపిస్తోంది.  చారిత్రాత్మక సినిమా అయినప్పటికి దానికి తగ్గట్టుగా సినిమా లేదని, ఎమోషనల్ డ్రామాను కరెక్ట్ గా కనెక్ట్ చేయలేకపోయారని టాక్ వినిపిస్తోంది.  దీని ప్రభావం కలెక్షన్ల పై పడే సూచనలు కనిపిస్తున్నాయి.  


ఫస్ట్ డే కలెక్షన్లు బాగానే ఉంటాయి అనడంలో సందేహం అవసరం లేదు.  అయితే, రెండు మూడు రోజుల తరువాత సినిమా కలెక్షన్లు పడిపోయే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.  సినిమా కోసం మెగా హీరోలంతా ప్రమోషన్ చేశారు.  మెగాస్టార్ చుట్టూనే కథ నడిచింది.  మిగతా స్టార్స్ కూడా సినిమాలో తమ వంతు సహకారం అందించిన ఎక్కడో తెలియదని ఒక చిన్న పొరపాటు సినిమాపై ప్రభావం చూపుతున్నది.  


సినిమా నిడివి కాస్త తగ్గించి ఉంటె ఇంకాస్త బాగుండేది.  మొత్తానికి ఈ సినిమాకు రామ్ చరణ్ పెట్టిన పెట్టుబడి తిరిగి వెనక్కి రావాలి అంటే ఏదైనా అద్భుతం జరగాలి.  సినిమాలో ఇంకేమైనా మిక్స్ చేయడమో లేదంటే నిడివి తగ్గించడం లాంటివి వీలైనంత త్వరగా చేయాలి.  లేదంటే చరణ్ పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడం కష్టం అయ్యేలా కనిపిస్తోంది.  


కష్ఠాలు పడకుండా.. నష్టాలు రాకుండా చూసుకుపోవాలి అంటే సినిమాకు తప్పనిసరిగా మరోసారి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే.  లేదంటే భారీ నష్టాలు తప్పవు.  విజువల్స్ పైనా, యుద్ధ సన్నివేశాలపైనా పెట్టిన దృష్టి.. డ్రామా విషయంలో పెట్టి ఉంటె సురేందర్ రెడ్డి మరో రాజమౌళిలా ఫేమ్ అయ్యేవాడు.  రాజమౌళికి మిగతా దర్శకులకు అదే తేడా.  రాజమౌళి ఒకటికి పదిసార్లు అలోచించి ప్రేక్షకులకు నచ్చే విషయాలనే సినిమాలో ఉంచుతాడు.  తనకు నచ్చినవి కాదు.  అందుకే అయన హిట్ అవుతున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: