రెండు రోజుల క్రితం మూవీ క్రిటిక్ అయిన కత్తి మషేష్.. సైరా మూవీ ఐదు వందల కోట్ల షేర్ను సాధిస్తుందని, అది మెగాస్టార్ చిరంజీవి సత్తా అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ బానే వైరల్ అవుతోంది. ఇప్పుడు ఆ వైరల్ నిజమే అయ్యేలా ఉంది. దాదాపు 300కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ అవలీలగా ఆ మొత్తాన్ని రికవరీ చేస్తుందని 1స్ట్ డే టాక్ వింటేనే అర్ధం అవుతుంది.

 

రేనాటి వీరుడైన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన    సైరా చిత్రం ఈ రోజు ఉదయం రిలీజ్ అయ్యుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 22న ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించిన చిత్రయూనిట్.. సినిమాను బాగానే ప్రమోట్ చేసారు.

 

  బాలీవుడ్ బిగ్ బి తో పాటు అన్ని ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటులు నటించడంతో.. అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని చాలా పెద్ద ఎత్తున రిలీజ్ రిలీజ్ చేసారు. మూవీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రేక్షకులు....రివ్యూలు పక్కన పెడితే....ఇప్పుడు అందరి కళ్ళు ఈ మూవీ కలెక్షన్ మీద ఉన్నాయి.  మరి దీనికి తగ్గట్టే.. ఫస్ట్ డే కలెక్షన్లు, హిందీలో కొల్లగొట్టబోయే కలెక్షన్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వసూళ్లపై చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే బుకింగ్స్ చూస్తుంటే.. దాదాపు అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నట్లు ట్రెండ్ అవుతోంది.

 

దసరా సెలవులు కావడంతో.. ఇక కలెక్షన్లలో సరికొత్త రికార్డులు రావడం ఖాయమని మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి తరువాత సైరా చేసే యుద్దంతో బాక్సాఫీస్ షేక్ అవుతుందని  వీరాభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: