ఇప్పుడు సైరా ఫీవర్ కాస్త సైరా మానియా గా మారిపోయింది....... ఏ నోట విన్నా సైరా మాటే. మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన సైరా నరసింహారెడ్డి ఇ ఈ రోజు ఉదయం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకొని కలెక్షన్ల దిశగా దూసుకెళుతోంది. ఆరు పదుల వయసులో ఈ చిత్రం కోసం మెగాస్టార్ చిరంజీవి చాలా కష్టపడ్డారు.

 

బాహుబలి తర్వాత 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చారిత్రక చిత్రం కావడంతో సినిమా నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు నిర్మాత రామ్ చరణ్. సాధారణంగా స్వాతంత్ర సమరయోధుల జీవిత కథలలో చివరి ఘట్టం బాధాకరంగానే ముగుస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని బ్రిటిష్ దొరలు చంపటం అందరికీ తెలిసిన కథే ..... అంతేకాకుండా డా గుమ్మానికి వేలాడే అంటే బ్రిటిష్ వారికి కి నా కసి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

 

కానీ తెలుగు తెరపై తమ అభిమాన నటుడిని క్లైమాక్స్లో చంపేస్తే అభిమానులు ఒప్పుకోరు అలాగని ఉన్న కథని వక్రీకరించి కాకుండా ఉన్నది ఉన్నట్టు చూపించాలి.దీంతో దర్శకుడు క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు కూడా ఉయ్యాల‌వాడ ర‌గిలించిన స్ఫూర్తితో దేశం స్వాతంత్ర్యం కోసం ఎలా పోరాడింది అనే కోణంలో చూపించి.. ఆయన ఉరి తీస్తుండటంతోనే పవన్ వాయిస్ ఓవర్ వస్తుందని తెలుస్తుంది.

 

అలా ఈ సినిమా చివరిలో తరువాత చరిత్రలో జరిగిన పరిణామాలు చూపించి వదిలేశారని తెలుస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా లాంటి వాళ్లు న‌టిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సైరా కు వస్తున్న రెస్పాన్స్ చూసి మెగా అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: