మహాత్మా గాంధీ అంటే...ఒక మామూలు మనిషి మహాత్ముడిగా మారిన వైనం, అహింసే ఆయుధంగా, మౌనమే తన సమాధానంగా పోరాటం సాగించిన మార్గం, వందల ఏళ్ళ పరాయిపాలనను కూకటివేళ్ళతో సహా పెకిలించిన విధానం అన్నీ కూడా అద్భుతాలే తెలువుతాయి అందరికి. మిగతావాళ్లందరికి అసాధ్యాలే... కానీ గాంధీజీకి మాత్రమే అది ఎలా వచ్చింది?, ఆయన ఊహ ఎలా నిజమైంది?, ఆయన మార్గం అనేకమందికి ఎలా మరిచేల  చెయ్యగలిగింది. అది అంత కూడా మాటల్లో చెప్పడం అంతగా సులభం కాదు...
 గాంధీజీ గురించి అందరికి తెలిసేలాగా సినిమా ద్వారా చాల సార్లు ప్రేక్షకులముందుకు తెచ్చారు.  గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఆయన కథతో, ఆయన జీవితం స్పూర్తితో తెరకెక్కిన సినిమాల విశేషాల గురించి ఇలా...గాంధీజీ పై చాలా సినిమాలు చిత్రీకరించారు. కానీ 1982లో తెరకెక్కిన గాంధీ సినిమా మాత్రం చాల ప్రత్యేకం. అయితే దానికి గాక ముఖ్య కారణం కూడా ఉంది. ఈ సినిమాని తీసింది  ఇంగ్లాండ్‌లో పుట్టిపెరిగిన రిచర్డ్ అటెన్‌బరో అనే ఫిల్మ్ మేకర్. ఆ సినిమాకి ఆయనే ప్రొడక్షన్ కూడా వహించాడు. ఇక ఆ సినిమాలో గాంధీగా నటించింది కూడా బ్రిటిష్ యాక్టర్ అయిన బెన్ కింగ్స్‌లే.

ఇది ఇలా ఉండగా  ఆ సినిమాలో గాంధీజీ పాత్రను అద్బుతంగా పోషించిన బెన్ కింగ్స్‌లే కి అకాడెమీ (ఆస్కార్) అవార్డు కూడా వచ్చింది అని అందరికి తెలిసిందే. అంటే గాంధీజీ జీవితంలో ఉన్న సారాంశం ఎంత గొప్పది అనేది ఆ సినిమాలో తెరకేకించడం వల్ల, అది అందరి మనసులకు హత్తుకోవడం వల్ల చాల పెద్ద విజయంకి సాధ్యమయింది. ఇక ఆ సినిమాతో మరొక సారి గాంధీజీ స్ఫూర్తి అనేకదేశాల్లోని ఎంతోమందిని  కూడా ఇన్స్పయిర్ చేసింది.

ఇక మన తెలుగులో కూడా శ్రీకాంత్ తన 100 వ సినిమాగా మహాత్మని సినిమా తీశారు. ఆ సినిమాలో  బస్తి రౌడీ జీవితాన్ని మహాత్ముడి గుణాలు, ఆలోచనలు ఎలా మార్చాయి,ఆ తరువాత అతని జీవితం ఎలాంటి మలుపులకి దరి తీసిందో చాలా అద్భుతంగా చూపించారు. గాంధీజీ చూపిన దారిలో నడవడమే జాతిపితకు మనం సమర్పించే అసలు సిసలైన నివాళి.



మరింత సమాచారం తెలుసుకోండి: