మెగాస్టార్ చిరంజీవి కలల ప్రాజెక్ట్ గా తెరకెక్కిన సైరా చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలయింది. ద‌క్షిణాది భాషలతో పాటు, హిందీలో కూడా సైరాని పేద ఎత్తున విడుదల చేశారు. అన్ని...ప్రాంతాల నుంచి సైరా చిత్రం సూపర్ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాకు మిక్స్డ్ టాక్ వ‌చ్చినా కూడా ఆరు పదుల వయసులో మెగాస్టార్ చిరంజీవి పడిన కష్టాన్ని మాత్రం ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. ఈ విషయంలో చిరుకు నూటికి నూరు మార్కులు వేయాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు.


అయితే ఓ చారిత్రాత్మక కథని తెరకెక్కించే టప్పుడు దర్శకుడు మరి సినిమాటిక్ లిబ‌ర్టీ తీసుకున్నా.. సీనియర్ హీరో గా కథను పక్కదారి పట్టించకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే చిరుపైనే ఉంది. చిరు సైతం పూర్తిగా కమర్షియల్ చట్రంలో ఇరుక్కు పోవడంతో సైరా విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి పూర్తి గా త‌న స్వేచ్ఛ‌తో పనిచేశాడు. దీంతో సురేందర్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టు తీసుకుంటూ వెళ్ళిపోయాడు.


ఇదిలా ఉంటే సైరాపై ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు... అగ్ర దర్శకులు.... అగ్ర హీరోలు పాజిటివ్‌గా తమ స్పందన తెలియజేస్తున్నారు. వాస్తవంగా ట్రేడ్ వర్గాల ద్వారా సైరా టాక్‌ ఇండస్ట్రీకి ఇప్పటికే స్పష్టంగా తెలిసిపోయింది. అలాంటి టైమ్ లో ఈ సినిమాను వాళ్లంతా భుజానికెత్తుకుని బలవంతంగా ట్వీట్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. అంతెందుకు సాహో ప్రి రిలీజ్ ఫంక్ష‌న్ల‌కు సైతం ప‌లువురు ఇండ‌స్ట్రీ సెల‌బ్రిటీలు వ‌చ్చి ఆకాశానికి ఎత్తేశారు.


ఆ సినిమా రిలీజ్ రోజున ప్లాప్ అయినా కూడా.. భారీ బ‌డ్జెట్ చిత్రం కావ‌డంతో ఎంక‌రేజ్ చేద్దామ‌ని అహో ఓహో అన్నారు. చివ‌ర‌కు సినిమా తుస్సుమంది. ఇప్పుడు సైరా విష‌యంలో కూడా వాళ్లంతా లేనిపోని మొహ‌మాటాల‌కు పోయి చిరు క‌ష్ట‌ప‌డ్డాడు.. బాగా ఖ‌ర్చు పెట్టార‌ని పాజిటివ్‌గా ట్వీట్లు వేస్తున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం ఆ కాంపౌండ్ డై హార్ట్ ఫ్యాన్స్ ఒత్తిళ్ల మేర‌కు బ‌ల‌వంత‌పు ట్వీట్లు వేస్తూ సైరాను హిట్ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: