మెగాస్టార్ చిరంజీవి సైరా మొత్తానికి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఇక సినిమా టాక్‌.. ఎవ‌రి అభిప్రాయాలు ఎలా ?  ఉన్నా ఇంత భారీ బ‌డ్జెట్ సినిమాకు కీల‌క‌మైన వీఎఫ్ఎక్స్ విష‌యంలో మాత్రం మేక‌ర్స్‌, డైరెక్ట‌ర్ ఇంత క‌ళ్లు మూసుకుని ఎలా ? వ‌్య‌వ‌హ‌రించారా ? అన్న సందేహాలు క‌ల‌గ‌క మాన‌వు. టెక్నిక‌ల్‌గా బాహుబ‌లి ఓ స్టాండ‌ర్డ్ సృష్టించింది. దాన్ని అందుకునే ప్ర‌య‌త్నం, సాహ‌సం చేసే ప్ర‌య‌త్నంలో సైరా టీం విఫ‌ల‌మైంది. 


ఇంకా చెప్పాలంటే కెమెరావ‌ర్క్‌, ఆర్ట్ ప‌నిత‌నం ప్ర‌ధ‌మ స్థాయిలో ఉన్నాయి. అయితే `ఇది సీజీలో తీశారు` అనే విష‌యం అతి సుల‌భంగా తెలిసిపోయేలా కొన్ని సీన్లు రూపొందించారు. ప్ర‌తీ స‌న్నివేశంలోనూ వంద‌ల‌మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు క‌నిపిస్తుంటారు. కొన్ని సీన్లు చూస్తుంటే అవి వీఎఫ్ఎక్స్‌లో తీశారా ?  లేదా హైద‌రాబాద్‌లోని అమీర్‌పేట‌లో స్టూడెంట్స్‌కు కోచింగ్ ఇచ్చే గ్రాఫిక్స్ డిజైన్ల‌తో రూపొందించేశారా ? అన్న సందేహాలు క‌ల‌గ‌క మాన‌వు.


అంత మ‌హా మ‌హా బాహుబ‌లిలోనే రానా దున్న‌పోతును ఢీ కొట్టే సీన్‌లో సీజీ వ‌ర్క్ తేలిపోయింది. సైరాలో అయితే ప‌దే ప‌దే ఇవి క‌నిపిస్తూనే ఉంటాయి. వీటిని సులువుగా గుర్తు ప‌ట్టేయ‌వ‌చ్చు. సైరా గురువు గోసాయి వెంక‌న్న ఉండే ఆశ్ర‌మం సెట్‌లో సీజీ వ‌ర్క్ పూర్తిగా తేలిపోయింది. అస‌లు ఆ సీన్లు చూస్తుంటే చాలా నాసిర‌కంగా ఉన్నాయి.


ఇక సినిమా స్టార్టింగ్‌లో జాత‌ర టైంలో వ‌చ్చే ఎద్దులు జాత‌ర‌ను పాడు చేసేందుకు వస్తోన్న టైంలో చిరు వాటిని డైవ‌ర్ట్ చేసేట‌ప్పుడు సైతం వీఎఫ్ఎక్స్ పూర్తిగా తేలిపోయింది. ఇంత బ‌డ్జెట్ పెట్టిన‌ప్పుడ ఇలాంటి చోట్ల ఎందుకు ?  దృష్టి పెట్ట‌లేదో ?  వాళ్ల‌కే తెలియాలి. ఇక మ‌ధ్య‌లో న‌ల్ల‌మ‌ల ఫారెస్ట్‌కు సంబంధించిన చోట కొన్ని సీన్లు షూట్ చేసిన‌ప్పుడు కూడా సీజీ తేలిపోయింది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: