దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో  ఈ రోజు  అమ్మవారిని శ్రీసరస్వతిదేవిగా ఆలంకరిస్తారు. చదువుల తల్లి సరస్వతి దేవి. మానవులకి సకల విద్యలను ప్రసాదించి వారిలో జ్ఞాన దీపాలను వెలిగించే విద్యాశక్తి సరస్వతి. త్రిశక్తుల్లో ఒక మహాశక్తి ఈ సరస్వతి దేవి.  

ఆది ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణిగా శుంభనిశుంభులనే రాక్షసుల్ని వధించింది. దానికి చిహ్నంగా అమ్మవారిని సరస్వతిదేవిలా అలంకరిస్తారు. చైతన్య స్వరూపిణిగా పురాణాలు సరస్వతీ దేవిని వర్ణిస్తున్నాయి. బుద్ధిని విద్యను జ్ఞానమును ప్రసాదించి తనను పూర్తి శరణాగతితో ఆరాధించే వారికి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని వివేచనా శక్తిని జ్ఞాపక శక్తిని కల్పనా నైపుణ్యాన్ని కవితా స్ఫూర్తిని రచనా శక్తిని ధారణా శక్తిని ప్రసాదించే కరుణామయి సరస్వతీ దేవి. 

సరస్వతి అమ్మవారు నెమలి వాహనం మీద ధవళ వర్ణ వస్త్రాలను ధరించి అక్షరమాల ధరించి అభయముద్రతో రెండు చేతులతో వీణను పట్టుకుని చందన చర్చిత దేహంతో దర్శినమిస్తుంది.  చైతన్య స్వరూపిణిగా పురాణాలు సరస్వతీ దేవిని వర్ణిస్తున్నాయి. మనోహరంగా కనిపించే సర్సతి దేవి ఆలం కారం కన్నుల పండుగగా ఉంటుంది. 

వాల్మీకి మహర్షి కాళిదాసు లాంటి లోకోత్తర కవులకు పురాణ పురుషులకు సరస్వతీ అమ్మవారు  తన మహిమతో వారిని కారణ జన్ములుగా చేసిన విషయాలకు  సంబంధించిన కధనాలు ఎన్నో మనకు పురాణాలలో కనిపిస్తాయి. ఈ రోజు అమ్మ వారికి అటుకులు బెల్లం సెనగపప్పు కొబ్బరి నైవేద్యం గా సమర్పిస్తారు. సర్సతి దేవిని కాశ్మీర్  పుర వాసిగా పిలుస్తారు.  ప్రస్తుతం పాకిస్తాన్ అధీనంలో ఆక్రమిత కాశ్మీర్ లో నీలం నంది పక్కన ఉన్న శారద అనే గ్రామంలో  సరస్వతి దేవికి సంబంధించిన శక్తి పీఠం ఉంది. ఈ పీఠాన్ని పాకిస్తాన్ లోని ప్రజలుఇప్పటికి  కూడ దర్శించుకుంటారు అంటే ఈ పీతం ఎంత శక్తి వంతం అయిందో మనకు అర్ధం అవుతుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: