‘సైరా’ కు టోటల్ పాజిటివ్ టాక్ వచ్చిన నేపధ్యంలో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకు పోతోంది. అయితే ఈ మూవీ ఓపెనింగ్ కలక్షన్స్ ‘బాహుబలి 2’ ఓపెనింగ్ కలక్షన్స్ ను దాటలేదు అంటూ స్పష్టమైన అంచనాలు వచ్చిన పరిస్థితులలో ఈరోజు చిరంజీవి మీడియా ముందుకు వచ్చి ‘సైరా’ ను సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు అదేవిధంగా ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వ్రాసిన మీడియా వర్గాలకు కృతజ్ఞతలు చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు ‘సైరా’ మూవీని ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్ర ఈనాటి తరానికి తెలియచేయాలని తీసిన మూవీ కాని ఈ మూవీని రికార్డుల కోసం తీసిన మూవీ కాదు అని అంటూ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు టాక్. అంతేకాదు ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూవీ బయ్యర్లు అంతా చాల ఆనందంగా ఉన్నారు అన్న మాటలు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. 

దీనితో వ్యూహాత్మకంగా చిరంజీవి ‘సైరా’ రికార్డులకు అతీతం అన్న సంకేతాలు ఇవ్వబోతున్నాడు. ఇది ఇలా ఉండగా నిన్న బాలీవుడ్ లో విడుదలైన వార్ కు బాలీవుడ్ మీడియా యావరేజ్ మార్కులు వేసి ‘సైరా’ కు చాల మంచి రేటింగ్స్ ఇవ్వడం సంచలనంగా మారింది. 

అయితే నిన్న ‘వార్’ కలక్షన్స్ కూడ చాల బాగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులలోని యంగ్ జనరేషన్ లో  ‘టైగర్ ష్రాఫ్’ చాల మంచి క్రేజ్ ఉన్న నేపధ్యంలో ఈ మూవీకి ఈ వీకెండ్ వరకు ఎదురులేదు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో పూర్తి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘సైరా’ బాలీవుడ్ లో ఎలాంటి సంచలనాలు చేయగలుగుతుంది అన్న విషయమై ఈ మూవీ కలక్షన్స్ రికార్డులు పై ఆధారపడి ఉంటాయి. ఇప్పటికే ఈ మూవీ పై రాజమౌళి మహేష్ లతో పాటు అనేకమంది ప్రశంసలు కురిపిస్తూ చేస్తున్న కామెంట్స్ తో తెలుగు రాష్ట్రాలలో ‘సైరా’ మ్యానియా దసరా పండుగ ముగిసే వరకు కొనసాగే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: