నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తరువాత జోష్ పెంచాడు.  మొదట్లో ఆచితూచి అడుగులు వేసిన బాలయ్య వరసగా సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యాడు.  ఇప్పుడు 105 వ సినిమా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు.  ఇందులో బాలయ్య న్యూ లుక్ తో కనిపిస్తున్నాడు.  చాలా వరకు సన్నబడి ఆకట్టుకున్నాడు.  ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది.  అయితే, సినిమా కోసం బాలయ్య సన్నబడటం, లావు కావడం చేయలేదు.  


కానీ, ఇప్పుడు ఆ పని చేయాల్సి వస్తున్నది.  తన 106 వ సినిమా బోయపాటితో కన్ఫర్మ్ అయ్యింది.  త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  తన 106 వ సినిమా కోసం బాలయ్య ఏకంగా 25 కేజీల బరువు తగ్గుతున్నాడు.  కథ ప్రకారం బాలయ్య అందులో సన్నగా కనిపించాలి.  25 కేజీలు బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. దీనికోసం రోజు జిమ్ లో ఐదు గంటలు కసరత్తులు చేస్తున్నాడు.  


వైట్ రైస్ తీసుకోవడం మానేశాడు.  డైట్ లో చాలా చేంజెస్ చేశారు.  దీంతో బాలయ్య కొత్త రూపంతో ప్రజల ముందుకు రాబోతున్నారన్నమాట.  బోయపాటితో బాలయ్య చేసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.  ఈ రెండు సినిమాల లాగానే, మూడో సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు.  సినిమా కోసం బాలయ్య చాలా కష్టపడుతున్నారు.  


బోయపాటి సినిమాలో బాలయ్య రెండు వేరియేషన్స్ లో కనిపించబోతున్నాడు.  ఒక పాత్ర చాలా యంగ్ గా ఎనర్జిటిక్ గా ఉంటుంది.  సినిమా పాత్ర కాబట్టి బాలయ్య తప్పనిసరిగా దానికి తగ్గట్టుగా మేకోవర్ ఉండాలి.  లేదంటే జనాలు సినిమాను తిరస్కరిస్తారు. ఎంత పెద్ద బడ్జెట్ సినిమా అయినప్పటికీ స్థాయికి తగ్గట్టుగా లేకుంటే జనాలు లైక్ చేయడం లేదు.  నిర్ధాక్షిణంగా తిరస్కరిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: