‘సైరా’ మూవీకి తెలుగు రాష్ట్రాలలో టోటల్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీ బిజినెస్ అత్యంత భారీ స్థాయిలో జరగడంతో ఈ మూవీ బయ్యర్లు తెలుగు రాష్ట్రాలలో గట్టెక్కాలి అంటే ముందుగా 116 కోట్ల నెట్ కలక్షన్స్ వచ్చి తీరాలి. ఇలాంటి పరిస్థితులలో కేవలం ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల నుండి ఈ దసరా సీజన్ పూర్తి అయ్యే లోపు 175 కోట్లకు పైగా గ్రాస్ కలక్షన్స్ వచ్చితీరాలి. 

తెలుస్తున్న సమాచారం మేరకు నిన్న ‘సైరా’ కు దేశవ్యాప్తంగా 50 కోట్ల నెట్ షేర్ ఓవర్సీస్ లో దరిదాపు ఒక మిలియన్ డాలర్ల దగ్గరలో ఈ మూవీకి కలక్షన్స్ వచ్చాయి అని లీకులు వస్తున్నా ఈ కలక్షన్స్ అధికారిక సమాచారం కాదు అని అంటున్నారు. ఈ మూవీ మ్యానియా తెలుగు రాష్ట్రాలలో బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమాను సాధారణ ప్రేక్షకుడు రెండవసారి చూడక పోతే ‘సైరా’ బయ్యర్లు గట్టెక్కడం కష్టం అన్న మాటలు వినిపిస్తున్నాయి. 

అంతేకాదు ఈ మూవీ ఓవర్సీస్ బయ్యర్ గట్టెక్కాలి అంటే 20 కోట్ల నెట్ కలక్షన్స్ వచ్చితీరాలి అని అంటున్నారు. ఇక కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో ‘సైరా’ పరిస్థితిని గమనిస్తే ఈ మూవీ తెలుగు కన్నడ తమిళ వెర్షన్స్ కు సంబంధించి 27 కోట్ల బిజినెస్ జరగడంతో ఈ మూవీకి కేవలం ఈ రెండు రాష్ట్రాల నుండి 30 కోట్లకు పైగా వచ్చితీరాలి అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇక ముఖ్యంగా ‘సైరా’ కలక్షన్స్ రికార్డులకు కీలక ప్రాంతమైన ఉత్తరాది ప్రాంతంలో నిన్న మొదటిరోజు ‘సైరా’ కు కేవలం 2 కోట్లు మాత్రమే అంటూ లీకులు వస్తున్నాయి. 

దీనితో ‘సైరా’ కు ఉత్తరాది ప్రాంతంలో ఎదురీత తప్పదా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. బాలీవుడ్ టాప్ స్టార్ అమితాబ్ ఉండి కూడ ‘సైరా’ కు రెండు కోట్ల నెట్ కలక్షన్స్ మాత్రమే రావడం దేనికి సంకేతం అంటూ కొందరు ఆశ్చర్య పోతున్నారు. అయితే బాలీవుడ్ మీడియా ‘సైరా’ కు మంచి రేటింగ్స్ ఇచ్చిన నేపధ్యంలో ఈ మూవీ కలక్షన్స్ ఈ వారాంతంలో చాల బాగుంటాయి అన్న అంచనాలు వస్తున్నాయి. దీనితో ‘సైరా’ దేశవ్యాప్తంగా పాజిటివ్ టాక్ వచ్చినా ఆ టాక్ కలక్షన్స్ ను సపోర్ట్ చేయదా అన్న సందేహాలు ఈ మూవీ బయ్యర్లను వెంటాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: