సైరా నరసింహ రెడ్డి ఎట్టకేలకు థియేటర్స్ లోకి పచ్చి చి సూపర్ హిట్ టాక్ అందుకొని బ్లాక్ బస్టర్ వైపుగా పరుగులు తీస్తుంది.  హిస్టారికల్ సినిమాలకు అడ్రస్ గా మారిన బాహుబలినీ ఆదర్శంగా తీసుకున్నారు సైరా చిత్రబృందం. బడ్జెట్ పరంగా కూడా సైరా కి బాహుబలి ధైర్యాన్నిచ్చింది. ఈ విషయాన్ని ఎన్నో సార్లు మెగా స్టార్ చెప్తూ వచ్చారు కూడా. ఒక హీరో విలన్ పాత్రలు హైలెట్ చేయకుండా ప్రతి పాత్రని హైలైట్ చేశాడు.



కాస్టింగ్ విషయంలో కూడా 'సైరా'కు బాహుబలినే ఆదర్శం అని చెప్పాలి. 'బాహుబలి' సిరీస్ లో ప్రభాస్ - అనుష్క - తమన్నాలతో పాటు కొన్ని సెపరేట్ క్యారెక్టర్స్ డిజైన్ చేసుకొని వాటికి బాగా త్యరాా సూట్ అయ్యేలా సత్య రాజ్ - రానా - రమ్య కృష్ణ లతో ఆ పాత్రలకు ప్రాణం పోసాడు జక్కన్న. ఈ వ్ష్్ 'బాహుబలి'ను ఆదర్శంగా తీసుకొని ఒక్కో భాష నుండి ఒక్కొక్కరిని తీసుకున్నారు. అంతెందుకు బాహుబలి రిలీజ్ తరవాత సైరా కథలో చాలా మార్పులు చేర్పులు చేశారట.

సినిమాలో దేశభక్తితో పాటు డ్రామా - సెంటిమెంట్ - ప్రేమ - పోరాట సన్నివేశాలు ఇలా అన్నీ 'బాహుబలి'లో ఉన్నట్టుగా సమపాళ్ళలో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక సినిమాలో యుద్ధ సన్నివేశాలు - యుద్ధం చేసే టప్పుడు ఎత్తుకుపై ఎత్తు వేసే విధానం ఇలాాచాలా విషయాలలో బాహుబలి ని ఫాలో అయ్యారు సైరా టీం. సైరా సినిమా చూస్తున్నంతసేపు  కచ్చితంగా ప్రేక్షకులకు వద్దన్నా 'బాహుబలి'ను జక్కన్న ను గుర్తుచేస్తాయి.



 నిజంగా చెప్పాలంటే ఇకముందుు తెలుగులో రాబోయే హిస్టారికల్సి నిమాలకు 'బాహుబలి' ఓ గొప్ప ప్రేరణగా నిలిచింది. అలాగే దర్శకులందరికీ ఓ పాఠంలా మారింది. ఒక రకంగా సురేందర్ రెడ్డి ఎలా లేదన్నా రాజమౌళి ని ఆదర్శంగా తీసుకునే చిరు ప్రతిష్టాత్మక సినిమాను చేపట్టారని ఒప్పుకోక క తప్పదు


మరింత సమాచారం తెలుసుకోండి: