మెగా కాంపౌండ్ హీరోల‌తో సినిమా చేయాలంటే ఏ టాలీవుడ్ డైరెక్ట‌ర్ అయినా గ‌జ‌గ‌జ‌లాడిపోతుంటాడ‌న్న టాక్ ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో ఎప్ప‌టి నుంచో ఉంది. వాళ్ల‌తో సినిమా అంటే ఏ ద‌ర్శ‌కుడికి అయినా చుక్క‌లు క‌న‌ప‌డుతుంటాయ‌డ‌ట‌. ఓ ప‌ట్టాన తేల్చ‌రు... ఓకే అన్నాక కూడా క‌థ‌లో వాళ్లు వేలు పెట్టి చేసే మార్పులు, చేర్పుల వ్య‌వ‌హారం గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదంటూ వాళ్ల గురించి తెలిసిన వాళ్లు గుస‌గుస‌లాడుకుంటూ ఉంటారు.


ఇక ప‌వన్‌క‌ళ్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్‌, సాయి ధ‌ర‌మ్‌, వ‌రుణ్ తేజ్ వీళ్లే ఇష్ట‌మొచ్చిన‌ట్టు డైరెక్ట‌ర్ల డ్యూటీలో వేలు పెట్టి కెలికేస్తుంటే ఇక వీళ్లంద‌రిక గురువు అయిన చిరంజీవి మాత్రం ఊరుకుంటారా ? అన్న‌ది ఆ కాంపౌండ్ హీరోల‌తో సినిమా చేసే వాళ్ల‌కే ఎరుక‌..!  ఇక ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాను వినాయక్ తీశాడా ?  లేదా ?  ఎవ‌రు తీశారు... ఆ సినిమా విష‌యంలో వినాయ‌క్ ఎప్పుడైనా క‌నిపించాడా ?  ఎందుకు సంతృప్తిగా లేడ‌న్న వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయో ?  అంద‌రికి తెలిసిందే.


ఇక ఇప్పుడు సైరా విష‌యంలో ఏం జ‌రిగింది ?  డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి ఎందుకు ?  సంతృప్తిగా లేడు ? అన్న ప్ర‌శ్న‌లు మ‌ళ్లీ వ‌స్తున్నాయి.  అస‌లు వాస్త‌వంగా ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ చెప్పిన క‌థ‌ను పూర్తిగా క‌మ‌ర్షియ‌ల్‌గా మార్చేశార‌ట‌. అస‌లు ఇంకా న‌యం చ‌రిత్ర కారుడి క‌థ‌ను కాసుల కోసం వ‌క్రీక‌రించారు.. ఇక ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలోలా ఓ ఐటెం సాంగ్ వేసి.. నాలుగు ఊర‌మాస్ స్టెప్పులు పెట్ట‌లేదు.. అందుకు మ‌నం సంతోషించాల్సిందే.
ఏదేమైనా సినిమా మ‌ధ్య‌లో ప్రెజ‌ర్ త‌ట్టుకోలేక వెళ్లిపోతే... చివ‌ర‌కు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు సైతం ప‌రువు పోతుంది.. మ‌ళ్లీ నీకు ఛాన్సులు రావ‌ని తీసుకు వ‌చ్చిన‌ట్టు కూడా టాక్ వ‌చ్చింది...!


మరింత సమాచారం తెలుసుకోండి: