భారీ సినిమాలను  పైరసీని  నుండి రక్షించడానికి ఎన్ని  ప్రయత్నాలు చేసిన్న ఆ ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి అన్న విషయం నిన్న విడుదల అయిన ‘సైరా’ విషయంలో రుజువు కావడం రామ్ చరణ్ కు షాకింగ్ గా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. ‘సైరా’ విడుదల రోజున ఆసినిమాకు సంబంధించిన వీడియోస్ మాత్రమే కాకుండా చిన్నచిన్న స్క్రీన్స్ షాట్స్ సైతం సోషల్ మీడియాలో కనిపించకుండా మెగా కాంపౌండ్ ఎన్నో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.   

కొందరు మెగా వీరాభిమానులు సరదాగా ‘సైరా’ కు సంబంధించిన ట్విట్టర్ ఫేస్ బుక్ లో పెట్టిన స్క్రీన్ షాట్స్ కూడా డిలీట్  చేసారు. ఇంత పకడ్బందీగా వ్యూహాత్మకంగా పని ప్రారంభించిన ‘సైరా’ టీమ్  కీలకమైన టైమ్ వచ్చేసరికి  తమిళ రాకర్స్ దెబ్బకు చేతులెత్తేసింది అన్న వార్తలు వస్తున్నాయి.  తెలుస్తున్న సమాచారం మేరకు నిన్న ఉదయం 6 గంటల నుంచే వర్క్ స్టార్ట్ చేసిన ‘సైరా’ టెక్నికల్ టీమ్ ‘సైరా’ విషయంలో తమిళ రాకర్స్ దెబ్బ ముందు ఆగలేక పోయింది అని వార్తలు వస్తున్నాయి.   

నిన్న సాయంత్రానికి ‘సైరా’ ఫుల్ మూవీ పైరసీ ప్రింట్ సోషల్ మీడియాలో హడావిడి చేసినట్లు వార్తలు రావడం ఈ మూవీ బయ్యర్లకు విపరీతమైన టెన్షన్ క్రియేట్ చేసింది. దీనితో పైరసీ లింక్స్ కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాల్సిందిగా ఒక ఈమెయిల్ ఐడీని కూడ చరణ్ టీమ్ చేత  క్రియేట్ చేసాడు. మెగా ఫ్యాన్స్ సహాయంతో ఆ మెయిల్ ఐడీ అందరికి బాగా తెలియడంతో ఇప్పుడు ఆ మెయిల్ ఐడీకి కుప్పలు తెప్పలుగా పైరసీ లింక్స్ వస్తున్నాయి అని టాక్.

దీనితోచరణ్ ఏర్పాటు చేసిన టీమ్  ఎన్ని తొలిగిస్తున్నప్పటికీ తమిళ రాకర్స్ బృందం మాత్రం రకరకాల సర్వర్ల నుంచి రకరకాల వెబ్ సైట్స్ నుంచి లింక్స్ ను తిరిగి అప్ లోడ్ చేస్తూ చరణ్ కు చుక్కలు చూపెడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. కనీసం ఈ వీకెండ్ ముగిసేవరకు పైరసీ జరగకుండా ఆపాలనేది చరణ్ ఏర్పాటు చేసిన టీమ్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా  తమిళ రాకర్స్ విసురుతున్న సవాల్ కు చరణ్ తల పట్టుకున్తున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: