‘సైరా’ మూవీని ప్రమోట్ చేస్తూ యధాలాపంగా చిరంజీవి అన్న మాటలు బాలకృష్ణ అభిమానులకు తీవ్ర కోపాన్ని తెప్పించినట్లుగా తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూలో  చిరంజీవి ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన బయోపిక్ ఎవరైనా తీయాలి అనుకుంటే సినిమా రంగానికి సంబంధించి తన జీవితంలో ఎటువంటి చీకటి కోణాలు లేకపోయినా తన రాజకీయ రంగానికి సంబంధించి తనకు ఎదురైన ఎన్నో వెన్నుపోటు ఎదురు దెబ్బ సంఘటనలు తన బయోపిక్ కు బాగా పనికివస్తాయి అంటూ కామెంట్ చేసాడు. 

ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ తన బయోపిక్ లో తన పాత్రను చరణ్ తప్ప మరెవరైనా తన మెగా కుటుంబ హీరోలు సరిపోతారని కామెంట్ చేసాడు. ముఖ్యంగా సాయి తేజ్ వరుణ్ తేజ్ అల్లు అర్జున్ లలో ఎవరు తన పాత్ర చేసిన తఃనకు అభ్యంతరం లేదని కామెంట్ చేసాడు. వాస్తవానికి చరణ్ తన పాత్రను ఎందుకు చేయకూడదు అన్న విషయమై చిరంజీవి ఒక క్లారిటీ ఇచ్చాడు. 

చరణ్ తన పాత్రను నటిస్తూ తనకు చరణ్ కొడుకుగా పుట్టిన సీన్ ను నటించే విషయంలో కొంచం అతిగా ప్రేక్షకులకు అనిపిస్తుందని కామెంట్ చేసాడు. అందువల్ల తాను చరణ్ ను తన బయోపిక్ లో నటించ వద్దని చెపుతాను అంటూ జోక్ చేసాడు. చిరంజీవి యధాలాపంగా అన్న ఈ కామెంట్స్ బాలయ్య అభిమానులకు తీవ్ర కోపాన్ని తెప్పిస్తున్నాయి. 

ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య ఎన్టీఆర్ పాత్రను పోషిస్తూ తనకు బాలకృష్ణ కొడుకుగా పుట్టిన సీన్ లో బాలయ్యకు పేరు పెడుతూ నటించిన సీన్ ను దృష్టిలో పెట్టుకుని చిరంజీవి ఇలాంటి కామెంట్ చేసి ఉంటాడు అంటూ బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పటికే ‘సైరా’ కలక్షన్స్ గురించి తల పట్టుకుంటున్నా చిరంజీవికి ఇప్పుడు అనుకోకుండా బాలయ్య అభిమానులు మాటల దాడి షాకింగ్ అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: