దసరా సీజన్ కావడంతో  సెలవులను  క్యాష్ చేసుకునేందుకు  యాక్షన్ హీరో గోపిచంద్ చాణక్య సినిమాతో రేపు ప్రేక్షకులముందుకు రానున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి  నటించిన   మచ్ అవైటెడ్ మూవీ  సైరా  ఈ సినిమాకంటే ముందుగానే విడుదలై  తెలుగు రాష్ట్రాల్లో దాదాపు  80శాతం థియేటర్లను ఆక్రమించుకుంది.  దాంతో  చాణక్య  కు థియేటర్లు దొరుకుతాయో లేవోనని గోపిచంద్ అభిమానులు టెంక్షన్  పడ్డారు.  కానీ మూడో రోజు తరువాత సైరా ను  కొన్ని థియేటర్లలో  తీసేసి చాణక్య ను ప్రదర్శించడానికి సిద్దమయ్యారు థియేటర్ల యాజమాన్యం.  అందులో భాగంగా చాణక్య తెలుగు రాష్ట్రాల్లో కలిపి  450థియేటర్లలో విడుదలవుతుండగా కర్ణాటక అలాగే ఇతర రాష్ట్రాల్లో కలుపుకొని 80 థియేటర్లలో, ఓవర్సీస్ లో 120థియేటర్లలో  ప్రదర్శితం కానుంది.  



ఇక ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాదిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా వున్నారు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో  తమిళ డైరెక్టర్ తిరు  తెరకెక్కించిన  ఈ చిత్రం లో  మెహ్రీన్ కథానాయికగా నటించగా  బాలీవుడ్  బ్యూటీ  జరీన్ ఖాన్ ముఖ్య పాత్రలో కనిపించనుంది.  సుమారు 40కోట్ల బడ్జెట్ తో  ఏకే  ఎంటర్టైన్మెంట్స్  పతాకంపై  అనిల్ సుంకర నిర్మించిన ఈచిత్రానికి  పడి పడి లేచె మనసు ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు.  147నిమిషాల నిడివి తో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.  ఇక లౌక్యం తరువాత  ఏకంగా వరుసగా 5 పరాజయాలను చవిచూసిన   గోపిచంద్ కు  చాణక్య విజయం  కీలకం కానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గోపిచంద్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి నూతన దర్శకుడు  బిను సుబ్రమణ్యం తెరకెక్కిస్తున్న చిత్రం కాగా రెండవది  సంపత్ నంది  డైరెక్షన్ లో  ఓ స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తున్నాడు. ఈచిత్రంలో  గోపిచంద్  మహిళల కబడ్డీ జట్టుకు కోచ్ గా కనిపించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: