దేవి నవరాత్రులలో 7వ రోజున  దుర్గాదేవిని కాళరాత్రి అవతారంలో ఆరాధిస్తారు. ఈ రూపంలో  అమ్మవారు  మండుతున్నట్లు ఉండి ముదురు ఛాయతో కనిపిస్తుంది. ఈ  రోజు అమ్మవారు ఒక గాడిద మీద ఆసీనురాలై ఉంటుంది. కాళరాత్రి దేవికి నాలుగు చేతులు ఉంటాయి. వీటిలో రెండు చేతులలో మంటని మరియు కత్తులను కలిగి ఉంటాయి. తరువాత రెండు చేతులలో ఒకటి వెలుగు నివ్వటంలో మరియు వరాలను ఇచ్చేదిగా ఉంటుంది.

దుర్గామాత రాక్షసుల దాడిని ఎదుర్కొన్నప్పుడు ఆమె బంగారు చర్మం తొలగిపోయి ఇలాంటి  హింసాత్మక భీకర రూపం ఆమెకు ఏర్పడిందని దేవి పురాణంలో పేర్కొనబడింది. కాళరాత్రి అనగా చీకటి మరియు భయంకరమైనది అని అర్థం. అన్ని దుష్ట శక్తులను ప్రతికూల శక్తులును లొంగ తీసుకునే మహాశక్తిగా ఈ రోజు అమ్మవారు కనిపిస్తారు. అయితే ఈ రోజు అమ్మ ఎంతో భయానకంగా కనిపిస్తునప్పటికి ఆమె మనసు మాత్రం పూర్తి గా ప్రేమతో నిండి ఉండి తనను కొలిచే భక్తులను ఆశీర్వదిస్తుంది. దీనితో ఈరోజు అమ్మను ఆమె శుభకరీ అని కూడా పిలుస్తారు.

ఈ అమ్మవారు మంచి చెడులను రెండింటిని సరిసమానంగా అమలు చేస్తుంది. చెడును శిక్షించి మంచిని ప్రోత్సహిస్తుంది. అలాగే కృషిని నిజాయితీని ఈ అమ్మవారు గుర్తిస్తుంది. జాతక చక్రంలో శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల ఏర్పడే ప్రతికూల పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ఈ  రోజున అమ్మవారిని ఈ రూపంలో ఆరాధిస్తే సమస్యలు అన్ని తొలిగి పోతాయని  మన నమ్మకం. 

కాళరాత్రి దేవిని నవరాత్రి 7వ రోజున పూజించడం వల్ల భక్తులలో అన్ని భయాలను తొలగించి పురోగతి  రావడమే కాకుండా అన్ని అడ్డంకులు తొలిగిపోతాయి. అమ్మవారు వ్యాధులను నివారించడమేకాక మానసిక శాంతిని కలుగజేసి మరియు ప్రశాంతతను పెంచుతుంది. ఈ అమ్మవారు తన భక్తులను మంచితనంతో శ్రేయస్సుతో ఉండాలని ఆశీర్వదిస్తుంది ఈ నవరాత్రులలోని ఏడవ రోజును "మహా సప్తమి" అని కూడా పిలుస్తారు. ఈ రోజున అమ్మవారిని ఎర్రటి పూలతో ఆరాధన చేసి ఆమెకు  పులిహార శనగలు చక్రపొంగలి నివేదన చేస్తారు..


మరింత సమాచారం తెలుసుకోండి: