ఆరడుగుల కటౌట్, మాస్ అప్పీల్ ఉండే లుక్‌తో ఉండే గోపీచంద్ గ‌త కొద్ది రోజులుగా మంచి క‌థా బ‌లం ఉన్న సినిమాల‌తో దూసుకు పోతున్నాడు.  తాజాగా గోపీచంద్, తమిళ దర్శకుడు తిరు కాంబినేషన్ స్పై థ్రిల్లర్ చిత్రం చాణక్య నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాను ఏకే ఎంట‌ర్‌టైన్స్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మించారు. వాస్త‌వంగా మే నెల‌లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆల‌స్యంగా ఈ రోజు రిలీజ్ అయ్యింది.


మ‌రో వైపు సైరా లాంటి భారీ సినిమా థియేట‌ర్ల‌లో ఉన్నా కంటెంట్‌పై న‌మ్మ‌కంతోనే చాణ‌క్య‌ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఇప్ప‌టికే కంప్లీట్ అయిన ఓవ‌ర్సీస్ ప్రీమియ‌ర్ల టాక్ ప్ర‌కారం సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. సినిమాలో సీనియర్ నటుడు నాజర్ లీడ్ చేసే రా (Raw) సంస్థలో గోపీచంద్ అండర్ కవర్ ఆఫీసర్.  స్పై థ్రిల్లర్ చిత్రాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కథనం కూడా ఉత్కంఠ భరితంగా సాగాలి. గోపీచంద్ తన నటనతో, యాక్షన్ సీన్ల‌లో అదిరిపోయే పెర్పామెన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు.


గోపీచంద్ న‌ట‌న అండ‌ర్ క‌వ‌ర్ ఏజెంట్‌గా అద్భుతంగా మెప్పించేలా ఉంది. ద‌ర్శ‌కుడు ఫ‌స్టాఫ్‌ను కాస్త సోసోగా న‌డిపించినా సెకండాఫ్‌ను మాత్రం చాలా బాగా ప్ర‌జెంట్ చేశాడు. గోపీచంద్, హీరోయిన్ ... మెహ్రీన్ మధ్య సాగే లవ్ సీన్స్ ఇంకా బాగా తీయాల్సి ఉంది. గోపీచంద్ పాల్గొనే కొన్ని అండ‌ర్ క‌వ‌ర్ ఆప‌రేష‌న్ల‌కు సంబంధించిన సీన్లు ప్రేక్ష‌కుడికి కావాల్సినంత థ్రిల్స్ ఇచ్చాయి.


ఓవ‌రాల్‌గా చాణ‌క్య‌తో గోపీ ఖ‌చ్చితంగా బంప‌ర్ హిట్ కొడ‌తాడ‌ని చెప్ప‌క‌పోయినా గోపీ కెరీర్‌లో చాణ‌క్య స‌రైన టైంలో సరైన హిట్ సినిమాగా నిలుస్తుంది అన‌డంతో ఎలాంటి డౌట్ లేదు. ప్రేక్ష‌కులు సినిమా చూస్తున్నంత సేపు ఇష్టంగానే ఎంజాయ్ చేస్తారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: