సినిమాల్లో అవకాశాలు రావడం అంత సులభం కాదు.  అవకాశాలు రాయాలి అంటే బ్యాక్ గ్రౌండ్ స్ట్రాంగ్ గా ఉండాలి.. సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు అయినా అయ్యుండాలి.. ఫ్యాషన్ ప్రపంచంతో మంచి అనుబంధం ఉండైనా ఉండాలి.  మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొని ఉంటె ఇంకా మంచిది.  అలా మిస్ ఇండియా ఇంటర్ కాంటినెంట్ పోటీలో విజేతగా నిలిచిన కోయినా  మిత్రా గురించి అందరికి తెలుసు.  


ఫ్యాషన్   మంచి  పేరు తెచ్చుకున్న కోయిన, సినిమాల్లో అంతగా అవకాశాలు రాలేదు.  వచ్చిన  ఒకటి రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు.  అదే సమయంలో ఈ అమ్మడు ముక్కుకు సర్జరీ చేయించుకుంది.  శరీరానికి  తగ్గట్టుగా ముక్కు సన్నగా నాజూగ్గా ఉండాలని కోరుకుంది.  కానీ, ఆ ముక్కు కారణంగా ఆమె అందం మొత్తం పోగొట్టుకుంది.  


అవకాశాలు రాలేదు. దీంతో పాపం ఎం చేయాలో తెలియలేదు. , 2004 లో ఆమె ముసాఫిర్ సినిమా చేసింది.  ఈ మూవీ మంచి హిట్ అయ్యింది.  ఇందులో ఓ సాకి సాకి అనే సాంగ్ చేసింది.  ఈ సాంగ్ సూపర్ అని చెప్పాలి.  ఈ సాకి సాంగ్ ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది. అయితే, ఈ అమ్మడు టర్కీకి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది.  అతని ప్రేమ దారుణంగా ఉండేది.  


 
బయటకు వెళ్లేందుకు వీలులేదని అనేవాడు.  షూటింగ్ ఉంది వెళ్ళాలి అని చెప్పబోతుంటే.. బాత్ రూమ్ లో పెట్టి తాళం వేశాడట.  అలానే, పెళ్లి చేసుకున్నాక టర్కీకి తీసుకెళ్లి తన పాస్ పోర్ట్ ను ముక్కలుగా చించేస్తానని చెప్పాడట.  దీంతో పాపం కోయిన భయపడింది.  అతనికి బ్రేక్ అప్ చెప్పేసి వచ్చేసింది.  కాగా, బాలీవుడ్ సెలెబ్రిటీ రియాలిటీ షో బిగ్ బాస్ లో ఈ విషయాన్ని పంచుకుంది.  మాములు వ్యక్తులే అనుకుంటే  సెలెబ్రిటీలు కూడా ప్రేమ పేరుతో మోసపోతున్నారు.  అంతేలే ప్రేమ ఏదైనా చేయిస్తుంది.  ఎంతదూరం అయినా తీసుకెళ్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: