వర్మ సినిమాలు ఇప్పుడు ఎలా ఉంటాయో తెలుసు.  కానీ 30 ఏళ్ల క్రితం వర్మ సినిమాలు అద్భుతంగా ఉంటాయి.  సంచలన విజయాలు సాధించాయి.  30 ఏళ్ల క్రితం వర్మ తీసిన శివ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ గతిని మార్చేసింది.  అంతకు ముందు వరకు సినిమా అంటే ఇలానే ఉండాలి.  ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి. ఇలా మేకప్ వేసుకోవాలి.  పేదలకు లిప్ స్టిక్ వేసుకోవాలి అని ఉండేది.  ఆ సినిమాలు చేసి చేసి నాగార్జునకు బోర్ కొట్టేదట. ఏదైనా కొత్తగా చేద్దామని అనుకుంటే చేసే చేసే వాళ్ళు దొరకలేదట.  


అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ తండ్రి కృష్ణంరాజు తన దగ్గరి వచ్చి మా అబ్బాయి ఓ కథ చెప్తాడు వినండి అన్నారట.  దానికి నాగ్ సరే అని చెప్పాడు.  వర్మ వచ్చి మొదట నాగ్ ను భయపెట్టేశాడు.  భయపెట్టడం ఏంటి అని షాక్ అవ్వకండి.  వర్మ చెప్పిన కథ ఓ హార్రర్ స్టోరీ కథ.  దాంతో నాగ్ భయపడిపోయారు.  నేను అలాంటి సినిమాలు చూడను.. చేయను.. తెలుగు ప్రేక్షకులు కూడా చూస్తారో లేదో తెలియదు.. మంచి స్టోరీ ఉంటె చెప్పండి చేద్దాం అన్నాడట నాగ్.  


ఆ తరువాత నాగ్ కు వర్మ శివ కథ చెప్పాడు.  కథ చెప్పిన వెంటనే నాగ్ ఒకే చేశాడు.  సినిమా షూటింగ్ చేసే సమయంలో చాలా ఎంజాయ్ చేశారట.  ఎంజాయ్ చేయడమే కాదు.. సినిమాలోని ప్రతి సీన్ రియలిస్టిక్ గా చూపించాడని, రౌడీలు వెనకనుంచి తరుముతుంటే.. సైకిల్ మీద పాపను ఎక్కించుకొని పారిపోయే వెళ్లే సీన్ డూప్ లేకుండా తీశారని నాగ్ చెప్పారు.  అంతకు ముందు సినిమాల్లో చైన్ పట్టుకొని కొట్టడాలు వచ్చాయి.. కానీసైకిల్ చైన్ ను లాగి కొట్టడం అనే ఆలోచన వర్మకు మాత్రమే వస్తుందని నాగ్ పేర్కొన్నాడు.  


సినిమా సమయంలో ప్రతి ఐదు పది నిమిషాలు షూటింగ్ చేసి.. కాసేపు అలా కూర్చుండిపోయే వాళ్లమని అన్నారు.  ఎందుకంటే.. స్టడీ క్యామ్ కెమెరాలతో షూటింగ్ చేయడం వలన అలసటగా అనిపించేదని నాగ్ చెప్పారు.  సినిమా సమయంలోనే అమల బాగా నచ్చిందని, అమలతో జీవితం పంచుకోవాలని అప్పుడే డిసైడ్ అయినట్టు నాగ్ చెప్పారు. ఇక  శివ సినిమాలో కథ అన్నది ఏమి లేదని.. కేవలం అన్ని కథనాలే అని.. వాటిని ఒక్కటిగా చేర్చితే శివ సినిమా అయ్యిందని అన్నారు.  సినిమా హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదని.. రిలీజ్ తరువాత సంచలన విజయం సాధించినట్టు వర్మ చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: