ఇప్పుడు దక్షిణాది సినిమాలు బాలీవుడ్ పై కన్నేశాయి.  ఒకప్పుడు ప్రాంతీయ సినిమా అంటే ఇక్కడ మాత్రమే రిలీజ్ అయ్యేది.  ఉత్తరాదికి వెళ్లేవారు కాదు.  ఉత్తరాది సినిమాలకు దక్షిణాది సినిమాలంటే చిన్నచూపు ఉండేది.  కానీ, రాజమౌళికి బాహుబలి రాక తరువాత స్వరూపం పూర్తిగా మారిపోయింది.  బాహుబలి సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చింది.  ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి.  ఈ మూవీని బాలీవుడ్ లో కరణ్ జోహార్ రిలీజ్ చేశారు.  


సినిమాకు వచ్చిన కలెక్షన్లు అన్నీఇన్నీకాదు.  ఈ మూవీ కలెక్షన్ల సునామికి అప్పటి వరకు ఉన్న రికార్డులు బద్దలయ్యాయి.  ప్రభాస్ కు బాలీవుడ్ లో మార్కెట్ పెరిగిపోయింది. కాగా, ప్రభాస్ నటించిన పక్కా యాక్షన్ సినిమా సాహో  ఈ సినిమా టాలీవుడ్ లో ఫెయిల్ అయ్యింది.  కానీ, బాలీవుడ్ లో మాత్రం సూపర్ హిట్.  కలెక్షన్లు భారీగా వచ్చాయి.  


బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లకు సినిమా లాభాలు తెచ్చిపెట్టింది.  టి సీరీస్ ఈ సినిమాను బాలీవుడ్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటె, బాలీవుడ్ లో అక్టోబర్ 2 వ తేదీన మరో యాక్షన్ సినిమా రిలీజ్ అయ్యింది.  అదే వార్. హృతిక్ రోషన్, టైగెర్ ష్రాఫ్ నటించిన మల్టీస్టారర్ సినిమా ఇది. పక్కా యాక్షన్ సినిమాగా తెరకెక్కించారు.  సినిమా ఒక రేంజ్ లో హిట్ కాలేదు.  బంపర్ హిట్ అయ్యింది.  


మొదట సినిమాకు ప్లాప్ టాక్ వచ్చింది.  తరువాత మెల్లిగా సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.  మౌత్ టాక్ తో సినిమా హిట్ కొట్టింది.  మొదటి రోజు రూ. 53.35 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే దూకుడును ప్రదర్శించింది.  రెండో రోజు రూ. 23.10 కోట్లు, మూడోరోజు శుక్రవారం రోజున రూ. 21.25 కోట్లు వసూలు చేసింది.  ఇక తమిళ, తెలుగు భాషల్లో కలిపి రూ.4.15 కోట్లు వసూలు చేసింది.  మొత్తం మీద మూడు రోజుల్లోనే వార్ రూ. 100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. 

ఈ ఊపు చూస్తుంటే లాంగ్ రన్ లో సినిమా అనేక రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తోంది. ఎలాగో ఈ సినిమాను చైనాలో కూడా రిలీజ్ చేస్తారు.  అక్కడి వాళ్లకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం కాబట్టి అక్కడ కూడా కలెక్షన్ల సునామి ఖాయం అని చెప్పొచ్చు.  మొత్తానికి బాలీవుడ్ జనాలకు యాక్షన్ సినిమాలంటే పిచ్చి అని అర్ధం అయ్యింది.  ఇంకెందుకు ఆలస్యం పక్కా యాక్షన్ కథలతో సినిమాలు తీస్తే సరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: