‘సైరా’ ప్రమోషన్ ను కొనసాగిస్తూ ఈ హడావిడి మధ్య చిరంజీవి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ ను భేటీ కావడం సినీ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.  దీనితో చిరంజీవి గవర్నర్‌ను ఎందుకు కలిసాడు అంటూ రాజకీయ వర్గాలలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. తమిళసై సౌందరరాజన్‌ తెలంగాణకు గవర్నర్‌గా నియమితులైన తర్వాత చిరంజీవి ఆమెను కలిసి శాలువాతో సత్కరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

గవర్నర్‌కు దసరా శుభాకాంక్షలు చెప్పిన మెగాస్టార్ ఆమెతో కొద్దిసేపు  మాట్లాడటమే కాకుండా తన లేటెస్ట్ మూవీ ‘సైరా’ విశేషాలు ఆమెకు తెలియచేసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమా చారం మేరకు ‘సైరా’ సినిమా ప్రత్యేకతలను గవర్నర్‌ కు తెలియచేసిన చిరంజీవి బ్రిటిష్ సైన్యం పై తొలి తిరుగుబాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత చరిత్రకు సంబంధించిన ‘సైరా’ ను చూడమని కోరినట్లు తెలుస్తోంది. 

ఆ అభ్యర్ధనకు గవర్నర్ చాలా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు  వార్తలు వస్తున్నాయి. ఈ  విషయాలకుతోడు అనేక ఆసక్తికర విషయాల పై వీరిమధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా తనతో మాట్లాడటానికి వచ్చిన చిరంజీవిపట్ల గవర్నర్ అత్యంత ఆదరణను వ్యక్త పరుస్తూ మాట్లాడినట్లు వార్తలు వ్బస్తున్నాయి. అదేవిధంగా చిరంజీవి తాను చెన్నైలో ఉన్న సమయంలో నాటి విషయాలను తమిళనాడుతో తనకు ఉన్న సంబంధాలను చిరంజీవి గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది. 

గత కొంతకాలంగా చిరంజీవి రానున్న ఎన్నికల సమయానికి భారతీయ జనతాపార్టీ వైపు అడుగు లు వేస్తాడని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు ఇలా ప్రత్యేకంగా చిరంజీవి గవర్నర్ ను ‘సైరా’ మూవీని చూడటానికి ఆహ్వానించడం వెనుక ఏదో ఒక వ్యూహం ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో రానున్న రోజులలో చిరంజీవి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అంటూ అప్పుడే ఊహాగానాలు ప్రారంభం అయ్యాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: