బిగ్ బాస్.. ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిగురించి వినిపిస్తోంది.  బిగ్ బాస్ షోకి చాలామంది అడిక్ట్ అయ్యారు.  అన్ని స్క్రిప్ట్ ప్రకారం నడిచే రియాలిటీ షో.  అది షో అని తెలుసు.  కాకపోతే రియల్ గా జరుగుతున్నట్టుగానే ఉంటుంది.  ఎక్కడ స్క్రిప్ట్ ప్రకారం నడుస్తున్నట్టుగా ఉండదు.  అందుకే రియాలిటీ షోగా దీనికి పేరు వచ్చింది.  ఈ రియాల్టీ షోలో ఎందుకని కంటెస్టెంట్ లు ఎక్కువుగా పాల్గొంటారో తెలుసా..


ఈ కంటెస్టెంట్ లో పాల్గొనే వ్యక్తులకు పారితోషికాలు భారీగా ఉంటాయి.  రెమ్యునరేషన్ కోసమే ఎక్కువమంది ఈ షోలో పాల్గొంటారు.  ఈ షోలో పాల్గొనే ప్రతి కంటెస్టెంట్ కు కొంత డబ్బు ఇస్తారు.  కొంత అంటే ఎదో కొద్దిగా అని అనుకుంటారేమో.. మినిమయం రూ . 25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది.  ఇప్పటికే 77 రోజులు పూర్తయ్యాయి.  మరో 23 రోజుల్లో షో పూర్తవుతుంది.  మొదటి బిగ్ బాస్ సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  


రెండో సీజన్లో నాని హోస్ట్ గా ఉన్నారు. ఇక మూడో సీజన్లో నాగార్జున హోస్ట్ చేస్తున్నారు.  ఈ మూడో సీజన్ కూడా చివరిదశకు చేరుకుంది.  సెకండ్ సీజన్లో కామన్ మ్యాన్ ను ఎంపిక చేశారు.  కానీ, మూడో సీజన్లో కామన్ మ్యాన్ ను ఎంపిక చేయలేదు.  అందరూ సెలెబ్రిటీలే కావడం విశేషం.  ఇలా ఒక్కో కంటెస్టెంట్ కు కొంత డబ్బు రెమ్యునరేషన్ గా ఉంటుంది కాబట్టి షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుంటారు.  


లోపల అన్ని సౌకర్యాలు ఉంటాయి.  కావాల్సిందల్లా గేమ్ ను ఆసక్తికరంగా ఆడటమే.  గేమ్ ను ఆసక్తికరంగా ఆడితే చాలు విన్ అయినట్టే.  ఎవరైతే ఆసక్తికరంగా ఆడతారో వాళ్లకు రేటింగ్ ఉంటుంది.  దాన్ని బట్టి విజేత ఎవరు అన్నది చివర్లో నిర్ణయిస్తారు. విజేతకు భారీగా డబ్బు ముట్టజెబుతారు.  మరి ఈ ఏడాది ఆ విజేత ఎవరో తెలియాలంటే ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: