‘సైరా’ ఫలితం పూర్తిగా తెలిసిపోవడంతో ఈ మూవీ బయ్యర్లు లాభాల మాట అటుంచి కనీసం బ్రేక్ ఈవెన్ కు రాగలుగుతామా అన్న సందేహాలలో ఉన్నారు. ప్రస్తుతం దసరా సీజన్ నడుస్తూ ఉన్నా తెలుగు రాష్ట్రాలలో కూడ చాల చోట్ల ‘సైరా’ కలక్షన్స్ డ్రాప్ అవుతున్న పరిస్థితులలో దసరా పండుగ ముగిసిన తరువాత ఈ మూవీ కలక్షన్స్ మరింత డ్రాప్ అయ్యే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తోంది అని అంటున్నారు.

దీనితో ఈ మూవీని అత్యధిక రేట్లకు కొనుక్కున్న బయ్యర్లు తమకు ఎంతోకొంత నష్ట పరిహారం ఇమ్మని ఈ మూవీ నిర్మాత రామ్ చరణ్ పై ఒత్తిడి చేసే ఆస్కారం ఉంది అని అంటున్నారు. దీనితో ఈ పరిస్థితులను ఊహించి ముందుగానే చరణ్ మళయాళ మూవీ ‘లూసీఫర్’ రీమేక్ హక్కులను తన సొంత ప్రొడక్షన్ హౌస్ కొణిదల ప్రొడక్షన్స్ పై తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘సైరా’ బయ్యర్లు విపరీతంగా నష్టపోతే వారి నష్టం నుండి ఆదుకోవడానికి ‘లూసిఫర్’ మూవీని రీమేక్ చేసి వారి నష్టాలకు పరిష్కారం చూపించాలని చరణ్ ఆలోచన అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ‘లూసిఫర్’ రీమేక్ లో మోహన్ లాల్ పాత్రను చిరంజీవి పోషిస్తే పృథ్వీరాజ్ చేసిన పాత్రలో రామ్ చరణ్ నటించబోతున్నాడని టాక్.

ఎప్పటి నుంచో చిరంజీవి రామ్ చరణ్ లు ఒక మల్టీ స్టారర్ లో నటిస్తే చూడాలని మెగా అభిమానులు కలలు కంటున్నారు. ఈ ఉద్దేశ్యాన్ని ఆధారంగా తీసుకుని ‘లూసిఫర్’ రీమేక్ ను చరణ్ చిరంజీవిల మల్టీ స్టారర్ గా మారుస్తారని ఈ మూవీకి సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తాడని ఇండస్ట్రీలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. కొరటాల శివ చిరంజీవిల మూవీ షూటింగ్ పూర్తి అయ్యాక ఈ రీమేక్ గురించి ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది అని అంటున్నారు..
 


మరింత సమాచారం తెలుసుకోండి: