వేరే సినిమా ఇండస్ట్రీస్ తో పోల్చుకుంటే మన టాలీవుడ్ లో హిట్ రేట్ కాస్త ఎక్కువే..మన దగ్గర స్టార్ హీరో ల సినిమాలకు ఏ రేంజ్ లో నమ్మకం పెట్టుకుంటారు అనేది అందరికి తెలిసిందే..దానికి స్టార్ట్ డైరెక్టర్ కూడా తోడూ అయితే ఇంక అంచనాలు పీక్స్ లో ఉంటాయి. వాటిని అందుకోలేక కొన్ని సినిమాలు ఎవరేజ్ గా నిలిస్తే మరికొన్ని చిత్రాలు మాత్రం పూర్తిగా నిరాశ పరిచి అట్టర్ ప్లాప్ గా నిలుస్తాయి.. మనం టాలీవుడ్ ప్రముఖ దర్శకుల నుంచి వచ్చిన కొన్ని చెత్త సినిమాలు గురించి తెలుసుకుందాం..

1.అజ్ఞాతవాసి

సినీ విమర్శకుల రివ్యూ : 2.5

పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అంచనాలు ఏస్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న అజ్ఞాతవాసిపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. కానీ ఆ అంచనాలన్నింటినీ తల్లక్రిందులు చేసింది.


2. అమర్ అక్బర్ ఆంటోనీ

సినీ విమర్శకుల రివ్యూ : 2

ఈ చిత్రంతో అయినా ఫేము లోకి వస్తాడని భావించిన శ్రీనువైట్ల అభిమానులకు నిరాశే. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంతో శ్రీనువైట్ల తన డిజాస్టర్ జర్నీని కొనసాగించాడు.


3.ఆఫీసర్:

నాగార్జునకు ఆర్జీవీ శివ లాంటి చరిత్రలో నిలిచిపోయే సినిమా అందించాడు.. నిజమే. కానీ వర్మ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఆఫీసర్ చిత్రంపై ఏమాత్రం అంచనాలు లేవు. కనీసం ఒకమాదిరిగా అయినా ఆడుతుందని భావించిన నాగ్ అభిమానులు ఈ చిత్రం షాకిచ్చింది. నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫీసర్ చిత్రం

4. షాడో:

మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు. వెంకటేష్ కెరీర్ లో ఇదో చెత్త చిత్రంగా నిలిచిపోయింది.

5.నక్షత్రం:

 సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ఇది. క్రియేటివ్ డైరెక్టర్ అని పేరున్న కృష్ణవంశీ చెత్త సినిమా తీశాడనే విమర్శలు ఎదురయ్యాయి.

6.ఆంధ్రావాలా :

ఇడియట్, అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి, శివమణి లాంటి సూపర్ హిట్స్ తో డాషింగ్ డైరెక్టర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అదే సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి చిత్రంతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. సింహాద్రి తర్వాత పూరి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఆంధ్రావాలా చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.

7. మృగరాజు:

చూడాలని ఉంది చిత్రంతో అప్పటికే గుణశేఖర్, చిరంజీవిలది సూపర్ హిట్ కాంబినేషన్. చిరంజీవి, అప్పటి యువత కలలరాణి సిమ్రాన్ జంటగా భారీ వ్యయంతో గుణశేఖర్ మృగరాజు చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ మృగరాజు చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

8.పలనాటి బ్రహ్మానాయుడు :

దర్శకుడు బి గోపాల్, బాలయ్య కాంబినేషన్ లో నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరి క

9.బిగ్ బాస్:

చిరంజీవి నటించిన ఈ చిత్రానికి విజయ బాపినీడు ఈ చిత్రానికి దర్శకుడు. అప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రం సంచలన వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీనితో సహజంగానే ఆ తర్వాత వస్తున్న బిగ్ బాస్ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ బిగ్ బాస్ చిత్రం చిరంజీవి కెరీర్ లో ఓ చెత్త సినిమాగా నిలిచిపోయింది.

10. ఒక్క మగాడు:

చూడాలని ఉంది చిత్రంతో అప్పటికే గుణశేఖర్, చిరంజీవిలది సూపర్ హిట్ కాంబినేషన్. చిరంజీవి, అప్పటి యువత కలలరాణి సిమ్రాన్ జంటగా భారీ వ్యయంతో గుణశేఖర్ మృగరాజు చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ మృగరాజు చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది

మరింత సమాచారం తెలుసుకోండి: