ప్రస్తుతం ఈ జెనరేషన్ లో ఒక హీరోయిన్ కు క్రేజ్ రావాలంటే లుక్స్ ఉండాలి.. బోల్డ్ యాటిట్యూడ్ ఉండాలి అని అందరికి తెలిసిందే. వీటికి యాక్టింగ్ కూడా జతచేరితే ఆ హీరోయిన్ కు తప్పనిసరిగా గొప్ప అవకాశాలు వస్తాయి అన్నది వాస్తవం.  ప్రస్తుతం 'రొమాంటిక్' హీరోయిన్ కేతిక శర్మ ఒక్కసారిగా తన లుక్స్ తో.. బోల్డ్ యాటిట్యూడ్ టాలీవుడ్ లో  ఫిలిం మేకర్లను ఆకర్షించిందనే అని సమాచారం.


 పూరి జగన్నాధ్ నిర్మాణంలో ఆకాష్ పూరి హీరోగా రాబోతున్న చిత్రం 'రొమాంటిక్' తో కేతిక శర్మ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ మధ్యే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ కూడా అయినా విషయం అందరికి తెలిసిందే.ఇక  ఒక పోస్టర్లో బీచ్ నేపథ్యంలో ఆకాష్ పూరి ఈ భామను భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు. ఇక  మరో పోస్టర్లో ఐతే కేతిక టాప్ లేకుండా ఆకాష్ ను గట్టిగా హత్తుకుంది.  ఈ పోస్టర్ ను చూసిన ప్రేక్షకులు ఎంత షాక్ అయ్యారో ఏమో కానీ టాలీవుడ్ ఫిలిం మేకర్లలో మాత్రం చాల పెద్ద  కలకలం ఏర్పడింది.  ఈ హాటు భామ ఎవరంటూ అని ఎంక్వైరీలు మొదలు పెట్టారు.  కేతిక యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయని కూడా తెలుసుకుంటున్నారు అన్న సమాచారం వినిపిస్తుంది.


 ఒకవేళ యాక్టింగ్ కనుక యావరేజ్ అని తెలిసినా చాలు తమ సినిమాలకు ఆఫర్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.  పూరి సారు స్కూల్ నుంచి వచ్చిన ఒక్క పోస్టర్ దెబ్బతో హీరోయిన్ కు ఇలాంటి ఎంక్వైరీలు చేయడం అంటే గొప్ప విషయమే కదా. మరి ఇక ఈ భామ గురించి మన ఫిలిం మేకర్ల కంటే సోషల్ మీడియాలో ఉండే కళాపోషకులైన నెటిజన్లకు చాల  చక్కగా తెలుసు.

ఎందుకంటే ఇన్స్టా గ్రాము వేడిని పెంచి ఆ వేడితో ఎంతో కాలం నుంచి చలి కాచుకుంటూ ఉంది ఈ భామ. 'రొమాంటిక్' సినిమా కనుక హిట్ అయితే మాత్రం ఈ  భామకు ఫుల్ గా ఆఫర్లు వస్తాయనడంలో  సందేహం  అవసరం లేదు. కొంతమంది అయితే కేతిక టాలీవుడ్ న్యూ సెన్సేషన్ అంటూ అంచనాలు కూడా వేస్తున్నారు అపుడే.మరి ఏమి  అవుతుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: