ఎన్టీఆర్ రామ్ చరణ్‌ లు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’ అన్న టైటిల్ తో నిర్మాణం కొనసాగిస్తోంది. ఈ మూవీకి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారు అన్న వార్తలు వచ్చాయి.   ఎన్టీఆర్ ‘కొమరం భీంగా’ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్ పవర్ ఫుల్ గా లేదు అన్న అభిప్రాయానికి రాజమౌళి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

 దీనితో ‘ఆర్ ఆర్ ఆర్‌’ ను విడదీస్తూ అర్థవంతమైన టైటిల్‌ ను పంపమంటూ ఆ మధ్య చిత్రయూనిట్ అభిమానులను కోరిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన ఎంతోమంది అభిమానులు తమకు తోచిన టైటిళ్లను పంపించారు.  వాటిలో ఒక టైటిల్ కు రాజమౌళి ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ‘రామ రౌద్ర రుషితం’ అనే పేరు ఈ మూవీకి ఖరారు అయినట్లు లీకులు వస్తున్నాయి. ఈ టైటిల్ చాల పవర్ ఫుల్ గా ఉంది అని రాజమౌళి భావించడంతో ఈ టైటిల్ ను త్వరలో రిజిస్టర్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక మూవీ భారీ విజయానికి టైటిల్ కూడ కీలకం కావడంతో ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదని రాజమౌళి భావిస్తున్నట్లు టాక్.

అయితే ఈ మూవీ హిందీ తమిళ కన్నడ మళయాళ భాషలలో విడుదల అవుతున్న నేపద్యంలో ఈ టైటిల్ ను మిగిలిన భాషలకు సంబంధించి ‘రైజ్ రివోల్డ్ రివేంజ్’ అనే పేరును కన్ఫర్మ్ చేయాలా లేదంటే ఏ భాషకు అనుగుణంగా ఆ పేరును ఆలోచించాలా అన్న కన్ఫ్యూజన్ రాజమౌళికి కొనసాగుతున్నట్లు టాక్. దీనితో అన్ని భాషల ప్రజలకు అర్ధం అయ్యే రీతిలో ఏదైనా సంస్కృత పదాలతో అందరికీ అర్ధం అయ్యే ఒక కామన్ టైటిల్ ఉంటే బాగుంటుందని రాజమౌళికి సూచనలు వస్తున్నట్లు తెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: