స్టార్ మా ఛానెల్లో జూనియర్ ఎన్టీయార్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 1 ప్రారంభమైంది. బిగ్ బాస్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. నాని హోస్ట్ గా ప్రారంభమైన రెండవ సీజన్ కూడా పరవాలేదనిపించుకుంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా 11 వారాల క్రితం బిగ్ బాస్ షో మూడవ సీజన్ ప్రారంభమైంది కానీ గత రెండు సీజన్లను భిన్నంగా సీజన్ 3లో కొన్ని విషయాలపై ప్రేక్షకుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. హోస్ట్ గా నాగార్జున ఆకట్టుకుంటున్నప్పటికీ కాంటెస్టెంట్ల పై, బిగ్ బాస్ నిర్వాహకులు చేస్తున్న కొన్ని తప్పులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
బిగ్ బాస్ షోలో ఎవరు ఎలిమినేట్ అవుతారో ప్రతి వారం ఒక రోజు ముందే లీక్ అయిపోతుంది. సోషల్ మీడియాలో ఎలిమినేట్ అయిన వారి గురించి తెలిసిపోతూ ఉండటంతో ప్రేక్షకుల్లో షోపై ఆసక్తి తగ్గుతోంది. టాస్కుల విషయంలో కూడా గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్ షోలో జరుగుతోంది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులు ప్రేక్షకుల్లో ఏ మాత్రం ఆసక్తి క్రియేట్ చేయటం లేదు. కొన్ని టాస్కులు బాగానే ఉన్నా బిగ్ బాస్ హౌజ్ మేట్స్ కొంతమంది ఆ టాస్కుల్లో అనవసరంగా గొడవలు పడుతూ టాస్కుల్ని నీరుగారుస్తున్నారు. 
 
గత రెండు సీజన్లలో బిగ్ బాస్ షోకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హెల్ప్ అవ్వగా ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మాత్రం షోకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన ఇద్దరూ బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టిన రెండు వారాలకే వెళ్లిపోయారు. బిగ్ బాస్ షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు మరియు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంటెస్టంట్లు వెళ్లిపోగా కొందరు వీక్ కాంటెస్టెంట్లు మాత్రం బిగ్ బాస్ షోలో ఇంకా కొనసాగుతున్నారు. 
 
ఇప్పటికే 11వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో ఈ వారం ఎలిమినేషన్ లో  వరుణ్ సందేశ్, మహేశ్ విట్టా, రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు. మహేశ్ విట్టా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది 
 



మరింత సమాచారం తెలుసుకోండి: